వెంకటేష్ ని అలా చూడగలరా.. గురూజీ ప్లాన్ ఏంటి..?
రైటర్ గా ఉన్నప్పుడు వెంకటేష్ కి సూపర్ హిట్ సినిమాలు అందించిన త్రివిక్రమ్ ఇప్పుడు డైరెక్టర్ గా మరో సూపర్ హిట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
By: Ramesh Boddu | 25 Oct 2025 8:00 PM ISTవిక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో మూవీని హారిక హాసిని బ్యానర్ తో పాటు ఫార్చున్ ఫోర్ మూవీస్ కలిసి నిర్మిస్తున్నారు. రైటర్ గా ఉన్నప్పుడు వెంకటేష్ కి సూపర్ హిట్ సినిమాలు అందించిన త్రివిక్రమ్ ఇప్పుడు డైరెక్టర్ గా మరో సూపర్ హిట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. గుంటూరు కారం తర్వాత త్రివిక్రం కాస్త గ్యాప్ తీసుకుని వెంకటేష్ తో సినిమా చేస్తున్నారు.
విక్టరీ వెంకటేష్ సెక్యూరిటీ గార్డ్ గా..
ఈ సినిమా కూడా ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఉంటుందట. ఫ్యామిలీ మొత్తం చూసే సినిమాగా ఇది తెరకెక్కిస్తున్నారు. ఐతే ఈ సినిమాలో వెంకటేష్ రోల్ గురించి ఒక లీక్ బయటకు వచ్చింది. సినిమాలో విక్టరీ వెంకటేష్ సెక్యూరిటీ గార్డ్ గా కనిపిస్తారట. వెంకటేష్ ఏంటి సెక్యూరిటీ గార్డ్ ఏంటి అనుకోవచ్చు. గురూజీ కథ కోసం హీరోల పాత్రలను టాక్సీ డ్రైవర్ లుగా చేస్తాడు.. అవసరమైతే సెక్యూరిటీ గార్డ్ గా కూడా చేస్తాడు.
వెంకటేష్ 76 సినిమాల కెరీర్ లో ఇదివరకు ఎప్పుడు ఇలా సెక్యూరిటీ రోల్ చేసింది లేదు. బాడీ గార్డ్ గా చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ సెక్యూరిటీ గార్డ్ గా మాత్రం చేయలేదు. ఐతే సినిమాలో ఆయన చేసే పాత్ర దాని చుట్టూ కథ చాలా బలంగా ఉంటాయని తెలుస్తుంది. అంతేకాదు వెంకటేష్ టైమింగ్ కు తగినట్టుగా త్రివిక్రమ్ మాటలు అదరగొట్టేస్తాయని తెలుస్తుంది. వెంకటేష్, త్రివిక్రమ్ ఈ కాంబో సినిమాపై ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందట.
మన శంకర వరప్రసాద్ సినిమాలో వెంకటేష్ క్యామియో..
ఈ సినిమాలో వెంకటేష్ కి జతగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా లాక్ అయ్యింది. ఈమధ్యనే తెలుసు కదా సినిమాతో మెప్పించిన శ్రీనిధి నెక్స్ట్ వెంకటేష్ తో ఛాన్స్ అందుకుంది. త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ అది కూడా వెంకటేష్ లాంటి స్టార్ తో స్క్రీన్ షేరింగ్ కాబట్టి శ్రీనిధికి ఈ సినిమా కలిసి వచ్చే అవకాశం ఉంది. వెంకటేష్ కూడా గురూజీ మీద పూర్తి నమ్మకం ఉంచేశాడని తెలుస్తుంది.
ఈ సినిమాను నెక్స్ట్ సమ్మర్ కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకటేష్ మరోసారి అదే రేంజ్ సక్సెస్ ఈసారి త్రివిక్రమ్ డైరెక్షన్ సినిమాతో కొట్టాలని చూస్తున్నారు. మరి సినిమా ఎంతమేరకు ఈ కాంబో పై ఉన్న అంచనాలను అందుకుంటుందో చూడాలి.
ఈ సినిమాతో పాటుగా వెంకటేష్ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమాలో క్యామియో రోల్ చేస్తున్నాడని తెలిసిందే. చిరంజీవి, వెంకటేష్ ఈ కాంబో స్క్రీన్ మీద అదరగొట్టేయడం ఖాయమని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు.
