వెంకీ మామ సూపర్ హిట్..కింగ్ అట్టర్ ఫ్లాప్!
సంక్రాంతి సమరం అంటే టాలీవుడ్ సీనియర్ స్టార్ల దగ్గరి నుంచి క్రేజీ యంగ్ హీరోల వరకు పోటీపడేందుకు రెడీ అయిపోతుంటారు.
By: Tupaki Entertainment Desk | 16 Jan 2026 12:35 PM ISTసంక్రాంతి సమరం అంటే టాలీవుడ్ సీనియర్ స్టార్ల దగ్గరి నుంచి క్రేజీ యంగ్ హీరోల వరకు పోటీపడేందుకు రెడీ అయిపోతుంటారు. ఆ సెంటిమెంట్‌తో ఈ సంక్రాంతికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, శర్వానంద్, నవీన్ పొలిశెట్టి పోటీకి దిగారు. మొత్తం నలుగురు పోటీపడితే ఇందులో ముగ్గురు మాత్రమే విజయం సాధించడం తెలిసిందే. ఇందులో మెగాస్టార్ చిరంజీవి నటించిన `మన శంకరవరప్రసాద్ గారు` గురించి ఇప్పుడు అంతా ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.
చిరు చాలా రోజుల తరువాత తన మార్కు టైమింగ్‌తో నటించడం.. సినిమాలోని ప్రతి సన్నివేశం కామెడీ పంచ్‌లతో నిండిపోవడం.. చిరు తనదైన టైమింగ్‌తో ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేకత ఏర్నడింది. అంతే కాకుండా ఇందులో వెంకీ మామ కీలక గెస్ట్ రోల్‌లో కనిపించడం, చిరు, వెంకీల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చాలా ఫన్నీగా ఉండటంతో ఇద్దరి ఫ్యాన్స్ ఈ మూవీని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వెంకీ మామ గెస్ట్ రోల్ చేసిన మూవీస్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
వెంకీ గెస్ట్ రోల్, సపోర్టింగ్ రోల్స్‌లో నటించిన సినిమాలు చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి. కానీ కింగ్ నాగార్జున గెస్ట్, అండ్ సపోర్టింగ్ రోల్స్ చేసిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని అంటున్నారు. వెంకీ గెస్ట్ రోల్‌లో నటించిన ప్రేమమ్, ఓరి దేవుడా, ఇప్పుడు `మన శంకరవరప్రసాద్‌గారు` సూపర్ హిట్‌లుగా నిలిచాయని, కింగ్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆ స్థాయి సక్సెస్‌లని సొంతం చేసుకోలేకపోయాయని కామెంట్‌లు చేస్తున్నారు. నాగార్జున నందిగా నటించిన `బ్రహ్మాస్త్ర` ఫ్లాప్ అయిందని చెబుతున్నారు.
ఇక ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల రూపొందించిన `కుబేర`లో నాగ్ దీపక్ తేజ్ అనే సీబీఐ ఆఫీసర్‌గా నటించిన విషయం తెలిసిందే. సినిమాకు భారీ అప్లాజ్ వచ్చినా మేకర్స్‌కి మాత్రం ఎలాంటి లాభాల్ని అందించలేకపోయింది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన `కూలీ` మూవీలో సిమోన్ గ్జావియర్‌గా కరుడు గట్టిన విలన్‌గా నటించినా ఫలితం లేకుండా పోయిందని, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్‌గా నిలిచి షాక్ ఇచ్చిందని వాపోతున్నారు.
అదే సమయంలో వెంకీ మామ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచి భారీ వసూళ్లని రాబడుతున్నాయని, రీసెంట్‌గా వెంకటేష్ ఎక్స్‌టెండెడ్ కామియో చేసిన `మన శంకరవరప్రసాద్ గారు` సూపర్ హిట్‌గా నిలిచి రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతోందని ప్రశంసలు కురిపిస్తున్నారు. కింగ్ ప్రయోగాల పేరుతో ఫ్లాప్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ట్రెండ్ సెట్టర్ స్టోరీలకు ఓకే చెబితే మంచి సక్సెస్‌లు వరిస్తాయని, ఇకపై స్టార్ కాస్ట్, రెమ్యూనరేషన్‌లకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మంచి కథలకు, పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
