స్టైలిష్ లుక్ లో వెంకీ.. అనిల్ మాట నిలబెట్టుకునేట్టే ఉన్నాడుగా!
టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో ఓ క్యామియో చేస్తున్న సంగతి తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 13 Dec 2025 1:27 PM ISTటాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో ఓ క్యామియో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ వెంకటేష్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఓ చిన్న గ్లింప్స్ ద్వారా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ వెంకీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ లుక్ లో వెంకీ చాలా స్టైలిష్ గా, రాయల్ గా కనిపిస్తున్నారు.
వెంకీకి చిరూ విషెస్
హెలికాప్టర్ ముందు చుట్టూ బాడీ గార్డ్స్ తో వెంకీ చాలా హుందాగా కనిపిస్తున్నారు. వెంకటేష్ బర్త్ డే సందర్భంగా తన ఫ్రెండ్, టాలీవుడ్ సీనియర్ హీరో, మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయనకు బర్త్ డే విషెస్ ను తెలుపుతూ పోస్ట్ చేశారు. నువ్వెక్కడున్నా నీ ప్రెజెన్స్ తో అక్కడ పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తావు, నీతో కలిసి చేసిన మన శంకరవరప్రసాద్ గారు షూటింగ్ లో ప్రతీ క్షణాన్నీ జీవితాంతం గుర్తుంచుకుంటాను, నీకు ఈ ఇయర్ అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా అని రాస్తూ సినిమాలో ఇద్దరూ కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేశారు చిరంజీవి.
20 నిమిషాల పాటూ ఉండనున్న వెంకీ పాత్ర
ఇక సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఈ పాత్ర చాలా సరదాగా, కొత్తగా ఉంటుందని, ఇది ఓ క్యామియోలా ఉండదని, ఆల్మోస్ట్ సినిమాలో ఓ క్యారెక్టర్ లాగానే ఉంటుందని, సినిమా సెకండాఫ్ లో వెంకీ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుందని, మూవీలో ఆఖరి 20 నిమిషాలు చిరూ, వెంకీ గారి మ్యాడ్ నెస్ చూస్తారని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పటికే పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు సినిమా నుంచి రిలీజైన వెంకీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే అనిల్ చెప్పింది ముమ్మాటికీ నిజమేననిపిస్తుంది. పైగా వెంకీ, చిరూ ఇన్నేళ్లుగా ఒకే ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ గా ఉంటున్నప్పటికీ వారెప్పుడూ కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకున్నది లేకపోవడంతో మన శంకర వరప్రసాద్ గారు పై అందరికీ భారీ అంచనాలున్నాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
