Begin typing your search above and press return to search.

నేను పెన్ను కూడా పెట్టలేదు.. బ్రహ్మితో రావిపూడి ట్విస్ట్

ఇక రూమర్స్ గోల తట్టుకోలేక తన తర్వాతి సినిమాపై వస్తున్న ఈ ప్రచారాలకు అనిల్ రావిపూడి తనదైన స్టైల్‌లో ఫుల్ స్టాప్ పెట్టేశారు.

By:  M Prashanth   |   10 Feb 2026 10:33 PM IST
నేను పెన్ను కూడా పెట్టలేదు.. బ్రహ్మితో రావిపూడి ట్విస్ట్
X

టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లలో ఒకరైన అనిల్ రావిపూడి ప్రతీ సినిమాతో తన బాక్సాఫీస్ రేంజ్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ కలెక్షన్లు రాబట్టిందో తెలిసిందే. జనవరి 12న విడుదలైన ఈ సినిమా నెల తిరగక ముందే 300 కోట్ల క్లబ్‌లో చేరి రికార్డులు క్రియేట్ చేసింది. మెగాస్టార్ రేంజ్ మాస్ ఎలిమెంట్స్, అనిల్ మార్క్ కామెడీ తోడవడంతో ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు.

అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగానే సహజంగానే డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. గత రెండు వారాలుగా సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. మొదట నాగార్జునతో ఒక భారీ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వెంటనే వెంకటేష్‌తో కలిసి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ లేదా మరో కొత్త కథను పట్టాలెక్కించబోతున్నారంటూ గాసిప్స్ తెగ వైరల్ అయ్యాయి. అసలు విషయం తెలియకముందే కాస్టింగ్, స్టోరీ లైన్ కూడా ఇవే అంటూ కథనాలు పుట్టుకొచ్చాయి.

ఇక రూమర్స్ గోల తట్టుకోలేక తన తర్వాతి సినిమాపై వస్తున్న ఈ ప్రచారాలకు అనిల్ రావిపూడి తనదైన స్టైల్‌లో ఫుల్ స్టాప్ పెట్టేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు, కానీ అప్పుడే నటీనటులు, కథ, టైటిల్ కూడా ఫిక్స్ చేసేశారు" అంటూ సెటైరికల్ పోస్ట్ పెట్టారు. ఈ ఫ్లో చూస్తుంటే తనే యాక్షన్.. కట్ కూడా చెప్పేస్తారేమో అన్నట్లు ఉందంటూ బ్రహ్మానందం మీమ్‌తో సరదాగా కౌంటర్ ఇచ్చారు.

అభిమానుల ఉత్సాహాన్ని తను అర్థం చేసుకోగలనని చెబుతూనే.. త్వరలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అనేది అఫీషియల్‌గా వెల్లడిస్తానని హామీ ఇచ్చారు. ‘మన శంకర వరప్రసాద్’ ఇచ్చిన జోష్‌లో ఉన్న అనిల్, ఈసారి కూడా ఒక పక్కా ఎంటర్‌టైనర్ ప్లాన్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా హిట్ ఇచ్చిన ఆనందంలో కథా చర్చలు ఇప్పుడే మొదలవుతున్నాయని ఆయన మాటలను బట్టి క్లియర్ గా అర్థమవుతోంది.

నిజానికి బాక్సాఫీస్ వద్ద 300 కోట్లు రాబట్టిన తర్వాత అనిల్ రావిపూడిపై అంచనాలు భారీగా పెరిగాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఏ స్టార్ హీరోను లైన్‌లో పెడతారనే క్యూరియాసిటీ ట్రేడ్ వర్గాల్లో కూడా ఉంది. వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో అనిల్ ట్రాక్ రికార్డ్ బాగుండటంతోనే ఈ స్థాయిలో రూమర్స్ వచ్చాయి. బహుశా ఫిబ్రవరి ఆఖరులోపు దీనిపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఏదేమైనా అనిల్ రావిపూడి క్లారిటీతో ఈ గాసిప్స్ రాయుళ్లకు కాస్త బ్రేక్ పడింది. మెగాస్టార్ సినిమా ఇచ్చిన సూపర్ హిట్ ఎనర్జీతో నెక్స్ట్ కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసే కథతోనే వస్తారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.