ఆ విషయంలో ఆందోళన పడుతున్న వెంకటేష్..!
ఇక్కడే అభిమానులకు ఒక ప్రశ్న ఎదురవుతోంది. ఆల్బమ్‌లో మొత్తం తొమ్మిది పాటలు ఉన్నప్పుడు మిగిలిన పాటలను ఇంత ఆలస్యంగా ఎందుకు విడుదల చేస్తున్నారు.
By: Priya Chowdhary Nuthalapti | 28 Oct 2026 10:00 PM ISTవిక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా పాటల విషయంలో మాత్రం దగ్గుబాటి అభిమానుల్లో కొంత ఆందోళన మొదలైంది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన ఒక ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నిన్న జరిగిన ఆదర్శ కుటుంబం ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమన్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఈ సినిమా ఆల్బమ్‌లో మొత్తం తొమ్మిది పాటలు ఉన్నాయని, ఇప్పటికే విడుదలైన పాటలు కాకుండా మిగిలిన ఏడు పాటలను ఆడియో జ్యూక్‌బాక్స్ రూపంలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయం విన్న అభిమానులు ఆశ్చర్యపోయారు.
ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. ముందుగా విడుదలైన నారాయణమ్మ పాట రీమిక్స్ తరహాలో ఉండటంతో కొందరు అభిమానులు దానిని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత వచ్చిన ‘మాలా’ పాటకు కూడా ఎక్కువగా నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది.
ఇక్కడే అభిమానులకు ఒక ప్రశ్న ఎదురవుతోంది. ఆల్బమ్‌లో మొత్తం తొమ్మిది పాటలు ఉన్నప్పుడు మిగిలిన పాటలను ఇంత ఆలస్యంగా ఎందుకు విడుదల చేస్తున్నారు. సాధారణంగా పెద్ద సినిమాలు చాలా బాగుండే పాటలు ముందుగా విడుదల చేస్తాయి. ఆ లెక్కనే తీసుకుంటే ఇప్పుడు రాబోయే ఏడు పాటలు విడుదల చేసిన రెండు పాటల కన్నా కూడా ఘోరంగా ఉండబోతాయా అనేది అభిమానుల్లో ఉండే ప్రశ్న.
అయితే ఇలా పాటలు బాగా లేకపోయినా సూపర్ హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. పాటలు సూపర్ హిట్ అయ్యి కూడా ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. అంతెందుకు బాహుబలి, కె.జి.ఎఫ్ లాంటి సినిమాలు పాటల పరంగా మొదట్లో నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ తెచ్చుకొని కూడా.. పాన్ ఇండియా హిట్లర్ తెచ్చుకున్నాయి. కాబట్టి అదే ఆదర్శ కుటుంబం విషయంలో కూడా రిపీట్ కానుందా అనేది చూడాలి.
శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నివేత పేతురాజ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన ట్రైలర్ ఎలివేషన్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి.
