వెంకటేష్ ఖాతాలో మరో 100 కోట్ల మూవీ రాబోతోందా?
విక్టరీ వెంకటేష్ డిఫరెంట్ సినిమాలతో టాప్ హీరోగా నిలిచారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు.
By: Gopi Velupala | 27 Oct 2026 8:15 PM ISTవిక్టరీ వెంకటేష్ డిఫరెంట్ సినిమాలతో టాప్ హీరోగా నిలిచారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు వెంకటేష్ సినిమాలు చూడడానికి అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇతర హీరోల అభిమానులు అభిమానించే ఏకైక టాలీవుడ్ హీరో వెంకటేష్...
100 కోట్ల మూవీ గా నిలుపుతాడా
గతేడాది వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా 300 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టింది. ఈ సంవత్సరం చిరంజీవి హీరోగా వచ్చిన 'మన శంకర్ వరప్రసాద్' సినిమాలో సైతం వెంకటేష్ ఒక క్యారెక్టర్ లో కనిపించాడు. ఈ మూవీ 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేసిన 'ఆదర్శ కుటుంబం' సినిమా ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఈజీగా 100 కోట్ల కలెక్షన్స్ రాబడుతుందనే అంచనాలో మేకర్స్ ఉన్నారు. వెంకటేష్ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమా భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతుంది. ఒకవేళ డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికి లాంగ్ రన్ లో ఈ సినిమా 100 కోట్ల వసూళ్లను రాబట్టే అవకాశాలైతే ఉన్నట్టుగా ట్రేడ్ పండితులు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా కూడా వెంకటేష్ ఈసారి డిఫరెంట్ గా తనను తాను ప్రజెంట్ చేసుకుంటున్నాడు. కాబట్టి అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరిస్తూనే యూత్ ని సైతం ఎంటర్ టైన్ చేసేలా ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ని చేశాడు. తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకున్నాడు. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాతో మరోసారి స్టార్ హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకుంటాడా? సీనియర్ హీరోలందరిలో వరుసగా 100 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొడుతున్న హీరోగా తనకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది చూడాలి...
అనిల్ రావిపూడి మూవీ కోసం వెయిటింగ్
ఇప్పటికే వెంకటేష్ అభిమానులు అనిల్ రావిపూడి తో చేస్తున్న 'జనవరి 12 విడుదల' సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈలోపు వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం' సినిమాతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తాడు. సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా పక్కాగా హిట్ అవుతుంది. కేవలం రెండు నెలల వ్యవధిలో ఆయన బ్యాక్ టు బ్యాక్ రెండు సక్సెస్ లను సాధిస్తే ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలందరికంటే కూడా వెంకటేష్ ముందంజలో ఉండే అవకాశమైతే ఉంది... ఈ సినిమాలు వెంకటేష్ కి ఎలాంటి గుర్తింపును తీసుకువస్తాయనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే...
