ప్రీమియర్లు వద్దంటున్న నాగవంశీ.. AK47 ప్లాన్ వేరేలా ఉందే..
ఈ మధ్య పెద్ద సినిమా రిలీజ్ అంటే ముందు రోజు నుంచే ప్రీమియర్లు, స్పెషల్ షోలు పెట్టడం కామన్ అయిపోయింది.
By: M Prashanth | 1 Oct 2026 3:21 PM ISTఈ మధ్య పెద్ద సినిమా రిలీజ్ అంటే ముందు రోజు నుంచే ప్రీమియర్లు, స్పెషల్ షోలు పెట్టడం కామన్ అయిపోయింది. టాక్ ముందే బయటకు వస్తే ఓపెనింగ్స్‌కు ఉపయోగపడుతుందనే లెక్కతో చాలామంది ఆ రూట్‌లో వెళ్తున్నారు. కానీ వెంకటేష్ ఆదర్శ కుటుంబం విషయంలో నాగవంశీ మాత్రం పూర్తిగా రివర్స్ ప్లాన్ పెట్టుకున్నారు. అక్టోబర్ 9న డైరెక్ట్ గా థియేటర్లలోనే కలుద్దామని, ప్రీమియర్లు ఉండవని ముందే చెప్పేశారు.
రిలీజ్ డేట్ కంటే ఈ నిర్ణయమే కాస్త ఇంట్రెస్టింగ్. ఆదర్శ కుటుంబాన్ని మొదటి నుంచే కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ సినిమా అని ప్రమోట్ చేస్తున్నారు. పైగా పిల్లల పరీక్షలు పూర్తయ్యాక హాలిడేస్ మొదలయ్యే టైమ్‌ను కూడా నాగవంశీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంటే ఫస్ట్ నైట్ ఫ్యాన్స్ షోల కంటే, తర్వాత రోజు నుంచి కుటుంబాలతో వచ్చే ఆడియన్స్ మీదే టీమ్ ఎక్కువగా ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది.
ప్రీమియర్లు పెడితే సినిమా మీద మొదటి టాక్ కొన్ని గంటల ముందే సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. అది బాగా పనిచేస్తే అడ్వాంటేజ్. తేడా వస్తే రెగ్యులర్ షోలు మొదలయ్యేలోపే నెగెటివ్ కామెంట్స్ కూడా తిరుగుతాయి. ఆదర్శ కుటుంబం లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు మాత్రం ఉదయం నుంచి నార్మల్ ఆడియన్స్‌తోనే టాక్ మొదలవ్వడం మరో రకమైన ప్లాన్ కావచ్చు.
మరోవైపు నాగవంశీ తన రిలీజ్ డేట్స్ మీద వచ్చే కామెంట్స్‌ను కూడా ఈసారి ముందే పట్టుకున్నారు. తమ రిలీజ్ పంక్చువాలిటీ మీద డౌట్ ఉండొచ్చని సరదాగా చెప్పి, అక్టోబర్ 9లో ఎలాంటి మార్పు లేదని క్లియర్ చేశారు. అక్టోబర్ 6న ట్రైలర్, 7న రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తామని కూడా షెడ్యూల్ ఇచ్చేశారు.
వెంకటేష్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడూ కీలకమే. అందుకే పిల్లల సెలవులు, వీకెండ్ అన్నీ కలిసి వచ్చే టైమ్‌ను రిలీజ్‌కు వాడుకోవడం కూడా ప్లాన్‌లో భాగంగా కనిపిస్తోంది. ట్రైలర్‌కు రిలీజ్‌కు మధ్య కేవలం మూడు రోజుల గ్యాప్ మాత్రమే ఉండటం వల్ల ప్రమోషన్‌ను కూడా ఎక్కువ రోజులు లాగకుండా నేరుగా థియేటర్ల దగ్గరకు తీసుకెళ్లేలా చేస్తున్నారు. అక్టోబర్ 9 ఉదయం నుంచే ఆదర్శ కుటుంబం అసలు టాక్ బయటకు వస్తుంది. ప్రీమియర్లు లేకపోవడంతో మొదటి రియాక్షన్స్ కూడా రెగ్యులర్ ప్రేక్షకుల నుంచే రావాల్సి ఉంటుంది. వెంకటేష్ ఫ్యామిలీ ఇమేజ్, హాలిడే టైమింగ్ రెండూ కలిసి వస్తే నాగవంశీ వేసిన ఈ డైరెక్ట్ రిలీజ్ ప్లాన్‌కు మంచి అడ్వాంటేజ్ దొరకొచ్చు.
