Begin typing your search above and press return to search.

ముగ్గురు బ్యూటీలతో వెంకీ మామ.. 'నారాయణమ్మ'తో మాస్ టచ్

నారాయణమ్మ అంటూ సాగే ఆ సాంగ్ ను లేటెస్ట్ గా మూవీ టీమ్ రిలీజ్ చేసింది. తమన్ స్వరాలు సమకూర్చిన ఆ పాటను ప్రభ, రామ్ మిరియాల ఎనర్జిటిక్‌ గా ఆలపించారు.

By:  M Prashanth   |   27 Sept 2026 8:20 PM IST
ముగ్గురు బ్యూటీలతో వెంకీ మామ.. నారాయణమ్మతో మాస్ టచ్
X

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌ లో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం - హౌస్ నంబర్ 47 మూవీపై ఆడియన్స్ లో ఇప్పటికే హైప్ నెలకొంది. టీజర్‌ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా సినిమాపై అంచనాలు పెంచిన టీమ్.. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ నారాయణమ్మతో మాస్ టచ్ చూపించింది.

నారాయణమ్మ అంటూ సాగే ఆ సాంగ్ ను లేటెస్ట్ గా మూవీ టీమ్ రిలీజ్ చేసింది. తమన్ స్వరాలు సమకూర్చిన ఆ పాటను ప్రభ, రామ్ మిరియాల ఎనర్జిటిక్‌ గా ఆలపించారు. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. పాటను చూస్తుంటే ఫెస్టివల్ ఎన్విరాన్మెంట్ ను తలపించేలా సందడిగా షూట్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే ఆ సాంగ్‌ లో వెంకటేష్‌తో పాటు ముగ్గురు హీరోయిన్లు సందడి చేశారు.

శ్రీనిధి శెట్టి, డింపుల్ హయాతి, నివేదా పేతురాజ్ తమ డ్యాన్స్‌ తో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. ముఖ్యంగా డింపుల్ హయాతి తన వైబ్రెంట్ స్క్రీన్ ప్రెజెన్స్‌ తో ఆకట్టుకున్నారని చెప్పాలి. వెంకీ మామ కూడా ముగ్గురు బ్యూటీలతో కలిసి స్టెప్పులు వేయడం సాంగ్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక నారాయణమ్మ పాట రెగ్యులర్ పార్టీ సాంగ్ తరహాలో సాగుతుంది. తమన్ ఇచ్చిన బీట్‌ కు తగ్గట్టుగా వెంకటేష్, హీరోయిన్ల డ్యాన్స్‌ ప్లాన్ చేశారు.

అయితే ఫ్యామిలీ స్టోరీతో తెరకెక్కుతున్న సినిమాలో ఇలాంటి మాస్ సాంగ్ ఉండటం ఇంట్రెస్ట్ ను పెంచుతోంది. పాటలో కనిపించే సందడి, డ్యాన్స్‌ స్టెప్పులు సినిమా పూర్తిగా సీరియస్‌ గా కాకుండా ఎంటర్టైన్మెంట్ కు ఇంపార్టెన్స్ ఇస్తుందని క్లియర్ గా చెబుతోంది. ఇటీవల రిలీజ్ అయిన ఆదర్శ కుటుంబం టీజర్‌ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా వెంకటేష్ కనిపించబోతున్నట్లు టీజర్ ద్వారా చూపించారు.

కుటుంబం చుట్టూ సాగే కథలో ఎంటర్టైన్మెంట్ తోపాటు ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. టీజర్ డిజిటల్ ప్లాట్‌ ఫామ్స్ లో 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు మూవీ టీమ్ తెలిపింది. ఇక‘ఆదర్శ కుటుంబం మూవీలో వెంకటేష్‌ కు జోడీగా యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. నారా రోహిత్, నివేదా పేతురాజ్, డింపుల్ హయాతి, పూజిత పొన్నాడ, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, దర్శకత్వం వహిస్తుండగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌ పై ఎస్. రాధాకృష్ణ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు టీజర్‌ తో కథపై ఇంట్రెస్ట్ పెంచిన ఆదర్శ కుటుంబం మూవీ టీమ్.. నారాయణమ్మ పాటతో మ్యూజికల్ జర్నీని మొదలుపెట్టింది. వెంకటేష్, ముగ్గురు బ్యూటీల సందడి సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతుందో తెలియాలంటే అక్టోబర్ 9వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.