Begin typing your search above and press return to search.

స్టార్ క‌పుల్ బ్రేక‌ప్.. ఇదిగో ఇదే ప్రూఫ్..

దీంతో ఇక ఈ జంట విడిపోయిన‌ట్టే అన్న పుకార్లు మ‌రింత ఉధృత‌మ‌య్యాయి. అయితే ఇప్ప‌టికీ వీర్ కానీ, తారా కానీ దీనిపై స్పందించ‌లేదు. ఇంకా మౌనాన్ని ఆశ్ర‌యించారు.

By:  Sivaji Kontham   |   3 Feb 2026 12:06 AM IST
స్టార్ క‌పుల్ బ్రేక‌ప్.. ఇదిగో ఇదే ప్రూఫ్..
X

ఆ ఇద్ద‌రూ ఒక‌రిని విడిచి ఒక‌రు ఉండ‌లేరు! చిలుకా-గోరింక‌ల్లా చూడ‌ ముచ్చ‌టైన జంట! అంటూ అంద‌రూ ప్ర‌శంస‌లు కురిపించారు. ఒక‌రి పుట్టిన‌రోజు వేడుక‌ల్లో ఒక‌రు ఎంతో లాల‌న‌గా మురిపెంగా సంద‌డిగా గ‌డిపారు. విదేశాల‌కు , స్వ‌దేశంలో ఎగ్జోటిక్ లొకేష‌న్లకు షికార్లు చేసారు. ఎయిర్ పోర్ట్ లో కెమెరాల క‌ళ్లు గ‌ప్పారు.. ఇంకా చాలా చేసారు. కానీ ఇప్పుడు ఏమైంది? అస‌లు ఈ జంట మ‌ధ్య ఎలాంటి గొడ‌వ‌లు వ‌చ్చాయి? స‌డెన్ గా అంద‌రినీ నిరాశ‌ప‌రుస్తూ ఎందుకు విడిపోయారు?

ఇలాంటి ఎన్నో ప్ర‌శ్న‌లు.. వీర్ ప‌హారియా- తారా సుతారియా జంట‌ను వెంటాడుతున్నాయి. గ‌డిచిన కొద్ది రోజులుగా ఈ జంట బ్రేక‌ప్‌పై ర‌క‌ర‌కాల పుకార్లు షికార్ చేస్తున్నాయి. లైవ్ షోలో తారా సుతారియాను గాయ‌కుడు ఏపీ థిల్లాన్ ముద్దు పెట్టుకున్న దృశ్యాలు వైర‌ల్ అయిన‌ప్ప‌టి నుంచి ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏదో అయిందంటూ ప్ర‌చారం సాగుతోంది. ప్రేమికులు ఒక‌రినొక‌రు క‌లుసుకోవ‌డం లేదు.. సోష‌ల్ మీడియాల్లో సంద‌డి అస‌లే లేదు. క‌నీసం ఒక‌రికొక‌రు హాయ్ చెప్పుకున్న‌ది లేదు. విషెస్ లేవు. బ‌ర్త్ డేల స‌మ‌యంలో అస‌లు స్పంద‌న‌లే లేవు. క‌నీసం పార్టీకి అటెండ‌యిన దాఖ‌లాలు లేవు.

ఫిబ్ర‌వ‌రి 1న వీర్ బ‌ర్త్ డే పార్టీలో చాలా మంది సెల‌బ్రిటీలు సంద‌డి చేసినా తారా సుతారియా మాత్రం క‌నిపించ‌లేదు. దీంతో ఇక ఈ జంట విడిపోయిన‌ట్టే అన్న పుకార్లు మ‌రింత ఉధృత‌మ‌య్యాయి. అయితే ఇప్ప‌టికీ వీర్ కానీ, తారా కానీ దీనిపై స్పందించ‌లేదు. ఇంకా మౌనాన్ని ఆశ్ర‌యించారు. గతంలో తారా సుతారియా, వీర్ పహారియా పుట్టినరోజులకు లేదా ఏదైనా చిన్న సందర్భానికైనా చాలా ఎమోషనల్ పోస్టులు పెట్టేవారు. కానీ ఈసారి తారా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో కానీ, ఇత‌ర మాధ్య‌మాల‌ పోస్ట్‌లలో కానీ వీర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు. కనీసం ఒక చిన్న హార్ట్ ఎమోజీతో కూడిన ఫోటో కూడా షేర్ చేయకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

వీర్ పహారియా తన సోదరుడు శిఖర్ పహారియా, సన్నిహిత మిత్రులు జాన్వీ కపూర్, నైసా దేవ‌గ‌న్, బాద్ షా, రియా చ‌క్ర‌వ‌ర్తి త‌దిత‌రుల‌తో క‌లిసి జరుపుకున్న వేడుకల్లో తారా మాత్ర‌మే మిస్స‌యింది. గత కొన్ని నెలలుగా వీరిద్దరూ కలిసి ఏ పార్టీలోనూ, ఈవెంట్‌లోనూ కనిపించకపోవడం ఈ బ్రేకప్ వార్తలకు ఆజ్యం పోస్తోంది.

ఆ ఇద్ద‌రి మ‌ధ్యా మ‌న‌స్ఫ‌ర్థ‌లు స్పష్ఠంగా ఉన్నాయి. అందుకే ఇక ఆ ఇద్ద‌రూ క‌ల‌వ‌డం కుద‌ర‌దు! అని కూడా ఇన్ సైడ్ సోర్స్ చెబుతోంది. కొంద‌రు త‌మపై వ‌స్తున్న పుకార్ల‌కు చెక్ పెట్టేందుకే ఇలా త‌మ బంధాన్ని ర‌హ‌స్యంగా ఉంచాల‌నుకుంటున్నార‌ని కూడా అంచ‌నా వేసారు. కానీ ఇది నిజానికి సాధ్యం కానిది. సాధారణంగా బాలీవుడ్ జంటల మధ్య ఇలాంటి మౌనం కనిపిస్తే అది బ్రేకప్‌కే సంకేతంగా మారుతుంటుంది. ఏది ఏమైనా.. ప్ర‌స్తుతానికి ఆ ఇద్ద‌రూ కెరీర్ పై దృష్టి సారించారు. తారా సుతారియా న‌టించిన `టాక్సిక్` త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. వీర్ ప‌హారియా త‌న త‌దుప‌రి చిత్రాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. మ‌డాక్ ఫిలింస్ లో ఓ సినిమా చేయ‌డానికి వీర్ స‌న్నాహ‌కాల్లో ఉన్నాడ‌ని కూడా క‌థ‌నాలొస్తున్నాయి. అయితే దీనిని అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంది.