యంగ్ కపుల్ బ్రేకప్ నిజమే.. ఇదిగో ఇదే ప్రూఫ్!
బ్రేకప్ చాలా బాధాకరం. అది వేదనకు దారి తీస్తుంది. పెయిన్ భరించడం అంత సులువు కాదు.
By: Sivaji Kontham | 15 Jan 2026 3:00 AM ISTబ్రేకప్ చాలా బాధాకరం. అది వేదనకు దారి తీస్తుంది. పెయిన్ భరించడం అంత సులువు కాదు. అయినా తప్పదు .. ప్రేమికులు అన్నాక భరించాలి! బాలీవుడ్ యువ నటుడు వీర్ పహారియా- తారా సుతారియా ఇప్పుడు అలాంటి బాధలో ఉన్నారని సమాచారం. ఈ జంట మధ్య బంధం తెగిపోయిందనే వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నుపుర్ సనన్, స్టెబిన్ బెన్ వివాహ వేడుకల తర్వాత ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
నుపుర్ సనన్ - స్టెబిన్ బెన్ వివాహ రిసెప్షన్ వేడుకకు వీర్ పహారియా ఒంటరిగా హాజరయ్యారు. గతంలో ఇలాంటి వేడుకలకు ఈ జంట ఎప్పుడూ కలిసి కనిపించేవారు. కానీ ఈసారి ఏదో లోపించింది. ఈ వేడుకలో తారా సుతారియా ఎక్కడా కనిపించకపోవడం.. వీర్ తన మిత్రులతో కలిసి మాత్రమే సందడి చేయడం చూస్తుంటే, వీరిద్దరూ విడిపోయారనేది నిజమేనని నెటిజనులు భావిస్తున్నారు.
గత కొన్ని నెలలుగా వీరిద్దరూ సోషల్ మీడియాలో కూడా ఒకరినొకరు పట్టించుకోవడం లేదనే చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం లేదా పాత ఫోటోలను డిలీట్ చేయడం వంటి మార్పులు గమనించిన అభిమానులు వీరి మధ్య ఏదో జరిగిందని అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో తారా సుతారియా తన సోలో వెకేషన్స్, కెరీర్‌కు సంబంధించిన ఫోటోలను మాత్రమే షేర్ చేస్తున్నారు.
మొన్నటికి మొన్న ఏపీ థిల్లాన్ కాన్సెర్ట్ లో లైవ్ లో అతడు తారా సుతారియాను ముద్దు పెట్టుకున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న వీర్ పహారియా అది చూశాక చాలా ఫీలయ్యాడని, ఈ ఘటన తర్వాత ప్రేమికులు పూర్తిగా బ్రేకప్ అయిపోయారని కూడా మీడియాలో కథనాలొచ్చాయి. అయితే ఏపీ థిల్లాన్ ముద్దు వ్యవహారం నిజం కాదని తారా వివరణ ఇచ్చారు. అది పర్ఫెక్ట్ ఎడిట్ కట్ వల్ల అలా కనిపించిందని తారా సుతారియా అన్నారు. వీర్, తారా ఇద్దరూ వేర్వేరు ప్రకటనల్లో దానిని ఖండించారు.
ఇప్పుడు బ్రేకప్ నిజమా కాదా? అనేదానికి ఇంకా పూర్తి స్పష్ఠత లేదు. అధికారికంగా ఆ ఇద్దరూ దీనిని ధృవీకరించలేదు. నిజానికి తారాతో ప్రేమాయణానికి ముందు, వీర్ పహారియా గతంలో సారా అలీ ఖాన్‌తో కూడా రిలేషన్‌లో ఉండగా, తారా సుతారియా ఆదార్ జైన్ నుంచి బ్రేకప్ అయింది. ఆ తర్వాత వీర్‌తో సన్నిహితంగా ఉండటం కనిపించింది. ప్రస్తుతానికి వీర్ పహారియా కానీ, తారా సుతారియా కానీ తమ బ్రేకప్‌పై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే బాలీవుడ్ సర్కిల్స్ ప్రకారం.. వీరిద్దరూ స్నేహపూర్వకంగానే విడిపోయారని సమాచారం.
వీర్ పహారియా నటుడిగా ఎదిగే ప్రయత్నంలో ఉన్నాడు. అక్షయ్ కుమార్ నటించిన `స్కై ఫోర్స్` సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేసిన అతడు తదుపరి సినిమాపై దృష్టి సారించాడు. తారా సుతారియా కూడా కొన్ని వరుస చిత్రాలతో బిజీ గా ఉంది.
