Begin typing your search above and press return to search.

వీడియో : మతి పోగొట్టే బికినీ బ్యూటీ

ప్రస్తుతం ఈమె చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయని, మరికొన్ని చర్చల దశలో ఉన్నట్లుగా ఆమె సన్నిహితులు, మీడియా వర్గాల వారు అంటూ ఉన్నారు.

By:  Ramesh Palla   |   22 Nov 2025 5:15 PM IST
వీడియో : మతి పోగొట్టే బికినీ బ్యూటీ
X

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన 'విజయదశమి' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ వేదిక. 2006లో తమిళ్ సినిమాలతో కెరీర్‌ను ఆరంభించిన ఈ అమ్మడు 2007లో తెలుగు సినిమాలో నటించింది. తెలుగులో ఈమె బాణం, దూరంగా దగ్గరగా సినిమాలతో పాటు పలు సినిమాల్లో నటించింది. కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా ఈ అమ్మడు తమిళ్‌, మలయాళం, కన్నడం, హిందీ సినిమాల్లోనూ నటించింది. ఈ మధ్య కాలంలో తమిళ్‌, కన్నడ భాషల సినిమాలకు ఈమె పరిమితం అయింది. ఈ ఏడాది ఒక కన్నడం, ఒక తమిళ్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయని, మరికొన్ని చర్చల దశలో ఉన్నట్లుగా ఆమె సన్నిహితులు, మీడియా వర్గాల వారు అంటూ ఉన్నారు.




విజయదశమి హీరోయిన్‌ వేదిక...

ఇన్‌స్టాగ్రామ్‌లో నాలుగు మిలియన్‌ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈ అమ్మడు సహజంగానే ఏ ఫోటో లేదా వీడియో షేర్ చేసినా వెంటనే వైరల్‌ అవుతూ ఉంటుంది. రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను, వీడియోలను ఈ అమ్మడు షేర్‌ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఆకట్టుకునే అందంతో పాటు, సన్నని నాజూకైన బాడీ ఈమె సొంతం అని అభిమానులు అంటూ ఉంటారు. అలాంటి అందమైన వేదిక రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేయడంతో ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూ వార్తల్లో నిలుస్తోంది. కమర్షియల్‌ బ్రేక్ లేకున్నా వేదిక తన అందంతో ఇండస్ట్రీలో కొనసాగుతోందని అనే వారు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈమె అందమైన వీడియో వైరల్‌ అవుతోంది. ఇటీవల ఈమె బికినీ లో ఉన్న వీడియోను షేర్ చేసి గుండెజారి గల్లంతయ్యే విధంగా చేసింది.




ఇన్‌స్టాగ్రామ్‌లో వేదిక బికినీ వీడియో...

సాధారణంగానే వేదిక అందాల ఆరబోత చేస్తే చూపు తిప్పుకోలేం, అలాంటిది అందమైన ఈ అమ్మడు అంతకు మించి అన్నట్లుగా ఇలా అందాల ఆరబోత చేస్తూ, బికినీలో సర్‌ప్రైజ్ చేస్తే ఏమైనా ఉందా అని చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బ్లాక్ బికినీలో ఈ అమ్మడు సముద్రంపై చాలా అందంగా కనిపిస్తుంది. సాగర కన్య మాదిరిగా ఈ అమ్మడి యొక్క అందం ఆకట్టుకుంటుంది. స్వతహాగా అందమైన ఈ అమ్మడు ఈ వీడియోలో మరింత అందంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు, బికినీలో ఈమె మరింత అందంగా కనిపిస్తోందని అంటున్నారు. వేదిక ఇంత అందంగా ఉన్నప్పటికీ ఆఫర్లు దక్కించుకోలేక పోవడంకు కారణం ఏంటో అని తెలుగు ఫిల్మ్‌ ఆడియన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.




టాలీవుడ్‌లో మరిన్ని సినిమాలు

ఇలాంటి అందమైన ఫోటోలు, వీడియోలను షేర్‌ చేసిన ప్రతి సారి నెటిజన్స్ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈమెను మరిన్ని తెలుగు సినిమాల్లో చూడాలి అనుకుంటున్నారు. స్టార్‌ హీరోలతో ఈమెకు నటించే అవకాశాలు దక్కక పోవడం వల్లే ఆశించిన స్థాయిలో ఈమె కెరీర్‌ ముందుకు సాగలేదు అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి వేదిక ఇండస్ట్రీలో ముందు ముందు అయినా మరిన్ని ఆఫర్లు అందుకోవాలని ఆమె అందాన్ని అభిమానించే వారు అంటున్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు కావస్తున్నా ఇంకా హీరోయిన్‌గా కొనసాగుతుంది అంటే కచ్చితంగా ఆమె అందం కారణం అనుకోవచ్చు. వయసు పెరిగినా కొద్ది మరింత అందంగా వేదిక కనిపిస్తుంది అనేందుకు ఈ బికినీ ఫోటోలు సాక్ష్యం అని మరికొందరు అంటున్నారు. మొత్తానికి వేదిక ఒక స్పెషల్‌ బ్యూటీ అని మరికొందరు తమ అభిమానంను చూపుతున్నారు.