Begin typing your search above and press return to search.

వేదిక 'స్పెషల్' సాంగ్.. ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోందిగా!

ఇప్పుడు సుల్తాన్ సాంగ్ ను సిల్వర్ స్క్రీన్ పై చూశాక.. ఒక్కో హీట్ పుట్టించే స్టెప్‌ తో అదరగొట్టిందని, మాస్ బీట్‌ కు తగ్గట్టుగా ఓ రేంజ్‌ లో డ్యాన్స్ చేసి షేక్ చేసిందంటూ సినీ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు.

By:  M Prashanth   |   19 March 2026 11:53 PM IST
వేదిక స్పెషల్ సాంగ్.. ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోందిగా!
X

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒకే ఒక్క సాంగ్ హాట్ టాపిక్‌ గా మారింది. అదే సుల్తాన్.. ముఖ్యంగా ఆ పాటలో సౌత్ హీరోయిన్ వేదిక వేసిన డ్యాన్స్ స్టెప్స్ నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. వీడియో సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఆ పాటకు సంబంధించిన క్లిప్స్, రీల్స్, షార్ట్ వీడియోలు తెగ వైరల్ అవుతుండగా, వేదిక ఎనర్జీకి నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు.

ఇప్పుడు సుల్తాన్ సాంగ్ ను సిల్వర్ స్క్రీన్ పై చూశాక.. ఒక్కో హీట్ పుట్టించే స్టెప్‌ తో అదరగొట్టిందని, మాస్ బీట్‌ కు తగ్గట్టుగా ఓ రేంజ్‌ లో డ్యాన్స్ చేసి షేక్ చేసిందంటూ సినీ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె హుక్ స్టెప్స్ ఇప్పటికే ట్రెండింగ్ లో నిలవగా.. యూత్ పెద్ద ఎత్తున రీ క్రియేట్ చేస్తున్నారు. మొత్తం మీద సాంగ్‌ లో వేదిక డ్యాన్స్ హైలైట్ మాత్రమే కాదు, పాటకు ప్రాణం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఆ ట్రెండింగ్ సాంగ్.. ఆడు 3: వన్ లాస్ట్ రైడ్ (Aadu 3: One Last Ride) అనే మాలీవుడ్ సినిమాలోనిది. నేడే ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా రిలీజ్‌ కు ముందే ఆ పాట భారీ హైప్ తెచ్చిపెట్టగా, ఇప్పుడు రిలీజ్ తర్వాత మరింత ట్రెండ్ అవుతోంది. పాటలో వేదిక కాస్ట్యూమ్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్‌ గా నిలిచాయి. రాయల్ టచ్‌ తో ఉన్న ఆమె లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇక ఆ పాటలో నటుడు వినాయకన్ సుల్తాన్ తరహా గెటప్‌లో కనిపించి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సుల్తాన్ సాంగ్ కు సంగీతాన్ని షాహ్ రహ్మాన్ అందించగా.. అనిలా రాజీవ్ ఆలపించారు. లిరిక్స్‌ ను మను మంజిక్ రాశారు. మాస్ బీట్, క్యాచీ ట్యూన్‌ తో ఆ పాట విడుదలైన కొద్ది రోజుల్లోనే ట్రెండింగ్‌ లోకి చేరి, ఇప్పుడు మరింతగా దూసుకెళ్తోంది.

ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన మిథున్ మాన్యూల్ థోమస్ ఆడు ఫ్రాంచైజీకి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. మూడో భాగంగా వన్ లాస్ట్ రైడ్ ను తీసుకురావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేశారు. సినిమాలో ప్రధాన పాత్రలో జయసూర్య నటించగా.. విజయ్ బాబు, సన్నీ వ్యేన్, సైజు కురుప్, ధర్మజన్ బోల్గట్టి, హరికృష్ణన్, భగత్ మాన్యూల్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

అయితే వేదిక.. తెలుగు సినీ ప్రియులకు కూడా సుపరిచితురాలే. తమిళ చిత్రం శివకాశి ద్వారా పరిచయమై, తెలుగులో బాణం, రూలర్ వంటి సినిమాల్లో నటించారు. పాన్ ఇండియా నటిగా గుర్తింపు పొందిన ఈమె, తన గ్లామరస్ ఫోటోషూట్స్, ఫిట్‌ నెస్‌ తో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఆమె.. సుల్తాన్ సాంగ్ తో కొన్ని రోజులుగా ట్రెండింగ్ లోనే కొనసాగుతున్నారు.