Begin typing your search above and press return to search.

బ్యాక్ అందాలతో మతిపోగొడుతున్న వేదిక.. ఫోటోలో వైరల్!

ఈ మధ్యకాలంలో సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే సెలబ్రిటీలు భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు.. అటు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు

By:  Madhu Reddy   |   25 Aug 2025 8:24 PM IST
బ్యాక్ అందాలతో మతిపోగొడుతున్న వేదిక.. ఫోటోలో వైరల్!
X

ఈ మధ్యకాలంలో సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే సెలబ్రిటీలు భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు.. అటు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డ చాలా మంది హీరోయిన్స్ భిన్నవిభిన్నమైన దుస్తులు ధరించి, తమ గ్లామర్ తో అభిమానులకు చెమటలు పట్టిస్తున్నారని చెప్పవచ్చు. అటు దర్శక నిర్మాతలు కూడా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రముఖ బ్యూటీ వేదిక కూడా ఏకంగా బ్లాక్ అవుట్ ఫిట్ లో బ్యాక్ అందాలు చూపిస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తోంది.

గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న వేదిక..

వేదిక షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోల విషయానికొస్తే.. బ్లాక్ కలర్ డీప్ వీ నెక్ కలిగిన డ్రెస్ ధరించిన ఈమె.. ఒకవైపు సైడ్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ముఖ్యంగా వెనక వీపు భాగంలో పూసలతో డిజైన్ చేశారు. ఇది ఈమె అందాన్ని మరింత హైలెట్ చేస్తోందని చెప్పవచ్చు. అటు పింక్ కలర్ ఫ్లవర్స్ తో ఆ బ్లాక్ డ్రెస్ కి స్ట్రాప్ రెడీ చేసి చాలా అందంగా డిజైన్ చేశారు.. ఈ ఫోటోలలో వేదిక గ్లామర్ లుక్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ కూడా పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా వేదిక లుక్ ఫాలోవర్స్ లో మరింత హీట్ పెంచుతోంది అనడంలో సందేహం లేదు.

వేదిక బాల్యం , విద్యాభ్యాసం..

1983 ఫిబ్రవరి 21న మహారాష్ట్రలోని సోలాపూర్ లో జన్మించింది. ఈమె పూర్తి పేరు వేదిక పూజా కుమార్. ముంబైలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఈమె.. యూనియన్ లండన్ లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో ఎంఎస్సీ పూర్తి చేసింది.

వేదిక సినీ ప్రయాణం..

చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకున్న వేదిక కాలేజ్ చదువుకునే సమయంలోనే ఒక వీడియో ఆల్బమ్ కూడా చేసింది.. ఆ ఆల్బమ్ ద్వారా మొదట తమిళ సినిమాలో అవకాశం లభించింది. శివకాశి సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ముని, విజయదశమి, బాణం, దగ్గరగా దూరంగా వంటి చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే వేదిక సినిమాలలో హీరోయిన్ గానే కాకుండా పలు పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. మంచు వారసురాలు మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో యక్షిణి అనే వెబ్ సిరీస్ లో నటించి తన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. హీరోయిన్ గానే కాకుండా డెవిల్ పాత్రలో కూడా ఒక్కసారిగా అలరించింది వేదిక.

వేదిక అందుకున్న అవార్డులు..

ఉత్తమ నటన కనబరిచినందుకు గానూ ఈమెకు బెస్ట్ ఎక్స్ట్రీమ్ పర్ఫామెన్స్ ఫిమేల్ అవార్డు లభించింది. అటు ఎడిసన్ అవార్డులతోపాటు పర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ వంటి అవార్డులు అందుకుంది. అటు తమిళ్ , మలయాళం, కన్నడ చిత్రాలలో కూడా నటించిన ఈమె.. అక్కడ కూడా పలు అవార్డులకు నామినేట్ చేయబడింది.