Begin typing your search above and press return to search.

ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన వేదిక.. అసలు ఏమైందంటే?

అంతలా అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేసే ఈమె.. నటనతో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది అని చెప్పవచ్చు.

By:  Madhu Reddy   |   21 Sept 2025 1:53 PM IST
ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన వేదిక.. అసలు ఏమైందంటే?
X

వేదిక (Vedhika) అనగానే ఎక్కువగా ఆమె బికినీ ఫోటోషూట్ ఎక్కువగా గుర్తుకొస్తుంది. అంతలా అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేసే ఈమె.. నటనతో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది అని చెప్పవచ్చు. సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూనే.. మరొకవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. అంతేకాదు డెవిల్ పాత్రలతో కూడా ప్రేక్షకులను భయపెడుతున్న విషయం తెలిసిందే. అలాంటి ఈమె తాజాగా ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది. బికినీలో కూడా నటిస్తాను.. మీకు ఏమైనా ప్రాబ్లమా అంటూ సంచలన కామెంట్లు చేసింది. మరి అసలేమైందో ఇప్పుడు చూద్దాం..

నాలుగు పదుల వయసులో కూడా అంతే ఫిట్ గా, యంగ్ గా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్న ఈమె.. తాజాగా కొన్ని విమర్శలు ఈమెకు కోపం తెప్పించాయి. గ్లామరస్ గా కనిపిస్తే చాలు వేలెత్తి చూపించడానికి సిద్ధంగా ఉంటారు అంటూ ఫైర్ అయ్యింది. ముఖ్యంగా హీరోయిన్లు అంటే చాలు విమర్శలు గుప్పించడానికి ఒక వర్గం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అందులోనూ కాస్త గ్లామర్ గా దుస్తులు ధరిస్తే ఏకంగా వారి క్యారెక్టర్ నే తప్పు పడుతున్నారు అంటూ మండిపడింది వేదిక. ఈ క్రమంలోనే వేదిక మాట్లాడుతూ.." దుస్తుల గురించి విమర్శించే దుస్థితి భవిష్యత్తులోనైనా మారాలి. నేను బికినీ కూడా ధరించి నటిస్తాను. ఇలాంటి విమర్శలను అసలు పట్టించుకోను. ముఖ్యంగా నేనేంటో నాకు తెలుసు. తప్పుడు బుద్ధి కలవారు మారితే అందరికీ మంచిది" అంటూ వేదిక ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది. మొత్తానికైతే ఆడవారి దుస్తుల విషయంలో వేలెత్తి చూపే కొంతమంది పై వేదిక చేసిన కామెంట్లు గట్టి కౌంటర్ లా అనిపిస్తున్నాయని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈమె ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడ, భాషల్లో ఒక్కో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దూసుకుపోతోంది. అందంతోపాటు అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న వేదిక ఇన్నేళ్లయినా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఒక స్టేటస్ కోసం ఎదురుచూస్తున్న ఈమెకు సరైన అవకాశాలు రావాలి అని.. అప్పుడే తానేంటో నిరూపించుకుంటుంది అంటూ కూడా మద్దతుగా నిలుస్తూ ఉండడం గమనార్హం.

వేదిక విషయానికి వస్తే.. మోడల్ గా కెరియర్ ను ఆరంభించిన ఈమె.. జగపతిబాబు, అర్జున్ హీరోలుగా వచ్చిన 'శివకాశి' అనే సినిమా ద్వారా తమిళ్ డబ్బింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ముని, విజయదశమి, బాణం, దగ్గరగా దూరంగా, రూలర్, రజాకార్, ఫియర్ వంటి తెలుగు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. కాంచన 3 , శివలింగ, పరదేశి, మద్రాసి లాంటి తమిళ చిత్రాలలో కూడా నటించింది. అంతేకాదు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ప్రేక్షకులను అలరించింది వేదిక. ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ బికినీ ఫోటోలతో ప్రేక్షకులను రెచ్చగొడుతోంది.