Begin typing your search above and press return to search.

మరోసారి విజయ్ హాలీవుడ్ టచ్.. ఈసారైనా సక్సెస్ అవుతాడా?

విజయ్ దేవరకొండను కింగ్డమ్ సినిమా నిరాశ పర్చింది. తొలుత సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినా లాంగ్ రన్ లో నిలదొక్కుకోలేకపోయింది.

By:  M Prashanth   |   17 Sept 2025 12:23 PM IST
మరోసారి విజయ్ హాలీవుడ్ టచ్.. ఈసారైనా సక్సెస్ అవుతాడా?
X

విజయ్ దేవరకొండను కింగ్డమ్ సినిమా నిరాశ పర్చింది. తొలుత సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినా లాంగ్ రన్ లో నిలదొక్కుకోలేకపోయింది. దీంతో సరైన హిట్ కోసం విజయ్ ఇంకా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన తన తదుపరి సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. ప్రస్తుతం విజయ్ ప్రముఖ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఇది VD 14 ప్రాజెక్ట్ టైటిల్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. నేషనల్ క్రష్ రష్మిక మంధన్నా హీరోయిన్ గా నిటిస్తుంది. టాలీవుడ్ లో వీళ్లది జోడీ సెన్సేషల్ జోడీ కావడంతో సినిమాపై హైప్ ఉంది. అయితే ఇంకో విషయం ప్రస్తుతం ఆసక్తిని రేపుతోంది. అదేంటంటే, హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనుండడమే!

హాలీవుడ్‌లో ది మమ్మీ సిరీస్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న ఆర్నాల్డ్ వోస్లూ.. ఈ చిత్రంతో టాలీవుడ్‌ లో తన అరంగేట్రం చేయబోతున్నారు. ఈ సినిమా కథలో విజయ్ దేవరకొండ డైనమిక్ రోల్‌ లో కనిపించబోతున్నారు. రాహుల్ సంకృత్యాన్ తన స్టోరీ టెల్లింగ్‌ తో సినిమాకు ప్రత్యేక ఆకర్షణను తీసుకురావడం, అలాగే హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్‌ తో కలిసి స్క్రీన్ షేర్ చేయడం ఈ సినిమాకు గ్లోబల్ లెవెల్ లో మార్కెట్‌ అయ్యే ఛాన్స్ ఉంది.

దీంతో ఈ సినిమాపై సోషల్ మీడియాలో ప్రస్తుతం భారీ హైప్ క్రియేట్ అయ్యింది. విజయ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకు గ్లోబల్ మార్కెట్‌ లో మంచి రెస్పాన్ ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా స్కేల్‌ ను మరింత పెంచడంలో కీలకంగా మారవచ్చని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

కాగా, విజయ్ కు సరైన హిట్ పడక చాలా కాలం అయ్యింది. గతంలో ఏన్నో అంచనాలతో వచ్చిన లైగర్, వరల్డ్ ఫేమల్ లవర్, ఖుషి. ఫ్యామిలీ స్టార్ అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. కింగ్డమ్ ఫర్వాలేదనిపించినా.. ఆశించిన స్థాయి విజయం అయితే కాదు. మరి పాన్ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ విజయ్ ను నిలబెడుతుందా లేదా అనేది చూడాలి.