Begin typing your search above and press return to search.

లేటుగా వచ్చినా బాక్సాఫీస్ బద్దలైపోద్ది.. వశిష్ట మాస్ ప్రామిస్!

మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన వేడుక అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది.

By:  M Prashanth   |   22 Aug 2026 10:16 AM IST
లేటుగా వచ్చినా బాక్సాఫీస్ బద్దలైపోద్ది.. వశిష్ట మాస్ ప్రామిస్!
X

మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన వేడుక అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ఈ ఈవెంట్ కు సినీ ప్రముఖులతో పాటు మెగా డైరెక్టర్లు కూడా హాజరై అప్డేట్స్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా చిరంజీవితో విశ్వంభర చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు వశిష్ట ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

వేదిక మీదకు వచ్చిన వశిష్ట ముందుగా అక్కడున్న మెగా అభిమానులకు, అతిథులకు నమస్కారం తెలియజేశారు. బాస్ బర్త్ డే అంటేనే అందరికీ ఒక పెద్ద పండగ లాంటిదని, అలాంటి పండగ వాతావరణంలో తను కూడా ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. వేదిక మీద నుంచే చిరంజీవి గారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక అసలు విషయానికి వస్తే, విశ్వంభర సినిమా గురించే వశిష్ట ముందే మాట్లాడారు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనే దానిపై ఇంకా క్లారిటీ రాకపోవడం, చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తుండటంతో ఫ్యాన్స్ కాస్త అసహనంగా ఉన్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ స్వయంగా ఓపెన్ గా యాక్సెప్ట్ చేశారు. ఇక్కడున్న చాలా మందికి తన మీద కోపం ఉందని, సోషల్ మీడియాలో రకరకాలుగా తిడుతున్నారని ఆయన గుర్తుచేశారు.

కొందరు పొగుడుతున్నా, మరికొందరు ట్విట్టర్ లో ఇష్టం వచ్చినట్లు వేసుకుంటున్నారని వశిష్ట ఓపెన్ గానే చెప్పారు. అయితే వాటన్నిటికీ వివరణలు ఇచ్చుకుంటూ కూర్చోకుండా, తన మీద కోపంగా ఉన్న వాళ్లందరికీ ఒకే ఒక్క మాట చెబుతున్నానని అన్నారు. రాసి పెట్టుకోండి.. విశ్వంభర ఎంత లేటుగా వచ్చినా బాక్సాఫీస్ బద్దలైపోద్ది అని ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఇచ్చిన స్టేట్మెంట్ అక్కడున్న ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించింది. నిజానికి విశ్వంభర సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కానీ రిలీజ్ డేట్ మీద ఉన్న సస్పెన్స్ వల్ల బయట రకరకాల రూమర్స్ వస్తున్నాయి.

ఇలాంటి టైమ్ లో దర్శకుడు ఏమాత్రం తడబడకుండా, ట్రోల్స్ గురించి మాట్లాడుతూనే సినిమా ఔట్ పుట్ మీద ఇంత నమ్మకం చూపించడం మామూలు విషయం కాదు. లేట్ అయినా లేటెస్ట్ గా వస్తాం అన్నట్లుగా వశిష్ట ఇచ్చిన ఈ క్లారిటీతో మెగా అభిమానుల్లో ఉన్న కన్ఫ్యూజన్ తగ్గిపోయిందనే చెప్పాలి. విజువల్స్ పనుల వల్లే ఈ ఫాంటసీ మూవీకి టైమ్ పడుతుందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. సినిమా ఎప్పుడు వచ్చినా బాక్సాఫీస్ లెక్కలు మారడం ఖాయం అని దర్శకుడు ప్రామిస్ చేయడంతో, ఇప్పుడు విశ్వంభర కోసం ఫ్యాన్స్ మరింత పాజిటివ్ గా ఎదురుచూస్తున్నారు.