చెప్పు దెబ్బల సీన్.. వెంకటేష్ అలా చేశాడా..?
అలానే నారప్ప సినిమా టైం లో జరిగిన ఒక విషయాన్ని వశిష్ట సింహా రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు.
By: Ramesh Boddu | 18 Sept 2025 4:00 PM ISTవిక్టరీ వెంకటేష్ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తనతో నటించే నటీనటులతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంటారు. సాధారణంగానే స్టార్స్ అంతా కూడా తమతో పనిచేసే యాక్టర్ ఎంత చిన్న వాడైనా సరే అతని దగ్గర తమ స్టార్ డం చూపించరు. మంచి మనసుతో వాళ్లకు కావాల్సిన సజెషన్స్ ఇస్తుంటారు. అలానే నారప్ప సినిమా టైం లో జరిగిన ఒక విషయాన్ని వశిష్ట సింహా రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు.
నారప్ప సినిమాలో వెంకటేష్..
నారప్ప సినిమాలో వశిష్టని వెంకటేష్ చెప్పుతో కొట్టాల్సిన సీన్ ఉందట. ఐతే డమ్మీ చెప్పు తెచ్చినా సరే ఒకవేళ నిజంగానే దెబ్బ తగులుతుందేమో అని వెంకటేష్ ఆ చెప్పుతో తనని కొట్టుకుని చూసిన తర్వాత వశిష్ట సింహా ను కొట్టాడట. అంతేకాదు సీన్ చేసే టైంలో వెంకటేష్ అతన్ని చెప్పుతో కొట్టడానికి కాస్త ఇబ్బంది పడుతుంటే వెంకీ సార్ ఏమి కాదు మీరు చేసేయండి అని చెప్పానని వశిష్ట అన్నాడట.
ఒక చిన్న యాక్టర్ కి దెబ్బ తగులుతుందన్న విషయాన్ని అంత పెద్ద స్టార్ ఆలోచించడం గొప్ప విషయమని అన్నాడు వశిష్ట. వెంకటేష్ తో నటించే నటీనటులంతా కూడా ఆయన ఆర్టిస్ట్ విషయంలో ఆయన చూపించే ప్రేమ, అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. వెంకీ సార్ తో నారప్ప సినిమా చేయడం వల్ల తనకు చాలా విషయాలు తెలిశాయని అంటున్నాడు.
కెరీర్ లో మంచి బ్రేక్..
ఈమధ్య తెలుగు సినిమాల్లో నెగిటివ్ రోల్స్ తో వశిష్ట మెప్పిస్తున్నాడు. ఐతే కెరీర్ లో ఒక మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు వశిష్ట. రీసెంట్ గా త్రిబాణధారి బార్బరిక్ సినిమాలో కూడా వశిష్ట నటించాడు. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లో కూడా వశిష్ట సత్తా చాటుతున్నాడు.
వేరే భాషలో హిట్టైన సినిమాలను, ప్రేక్షకాదరణ పొందిన సినిమాలను మన వెంకీ మామ రీమేక్ చేస్తుంటాడు. ఐతే రీమేక్ సినిమానే అయినా అందులో వెంకటేష్ చూపించే అభినయం మాతృక సినిమాను కూడా మరిపించేస్తుంది.
ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రం తో ఒక సినిమా చేస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న వెంకటేష్ త్రివిక్రం సినిమాతో కూడా పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నారని తెలుస్తుంది. వెంకటేష్ త్రివిక్రం కాంబోలో వస్తున్న తొలి సినిమా ఇది. అందుకే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. వెంకటేష్ త్రివిక్రం సినిమా నుంచి ఫస్ట్ లుక్ టీజర్ ఈ దసరాకి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. హారిక హాసిని బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటూ వెంకీ మార్క్ టైమింగ్ కూడా అదిరిపోతుందట.
