Begin typing your search above and press return to search.

నో అప్డేట్స్.. కానీ ఫుల్ ట్రెండింగ్..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆ ఫాంటసీ మూవీపై అభిమానుల్లో ఉన్న ఇంట్రెస్ట్ ను దర్శకుడు వశిష్ట చేసిన ఒక్క పోస్ట్ మరోసారి క్లియర్ గా చూపించింది.

By:  M Prashanth   |   18 Sept 2026 3:48 PM IST
నో అప్డేట్స్.. కానీ ఫుల్ ట్రెండింగ్..
X

సినిమా నుంచి కొత్త పోస్టర్ లేదు.. టీజర్ లేదు.. పాట లేదు.. అయినా సోషల్ మీడియాలో మాత్రం విశ్వంభర పేరు వినిపిస్తూనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆ ఫాంటసీ మూవీపై అభిమానుల్లో ఉన్న ఇంట్రెస్ట్ ను దర్శకుడు వశిష్ట చేసిన ఒక్క పోస్ట్ మరోసారి క్లియర్ గా చూపించింది. దీంతో అసలు ఆ పోస్టులో ఏమైనా స్పెషల్ మీనింగ్ ఉందా అంటూ నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు.

వశిష్ట శివుడికి సంబంధించిన ఓ ప్రవచన వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. "శ్వాస నాది.. శాసనం నీది.. ఆశ నాది.. పాశం నీది.. ఆత్మ నాది.. ఆట నీది.. ఎంత మాయగాడివయ్యా.. ఇందుకేనా నిన్ను విశ్వంభరుడు అని పిలిచేది" అంటూ క్యాప్షన్ పెట్టారు. చివర్లో సర్వం శివం.. ఓం నమః శివాయ అని పేర్కొన్నారు. వశిష్ట చాలా కాలం తర్వాత ఇలాంటి పోస్ట్ చేయడంతో దీనిపై ఫ్యాన్స్ ఫోకస్ పెట్టారు.

ముఖ్యంగా విశ్వంభరుడు అనే పదాన్ని దర్శకుడు స్పెషల్ గా ఇన్క్లూడ్ చేయడంతో.. దీనికి సినిమా కాన్సెప్ట్‌ తో ఏమైనా సంబంధం ఉందా అనే చర్చ మొదలైంది. అయితే ఇది సినిమా కథకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అని మాత్రం మూవీ టీమ్ ఎక్కడా వెల్లడించలేదు. నిజానికి విశ్వంభరపై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. చిరంజీవి చాలా గ్యాప్ తర్వాత ఫాంటసీ కథలో నటిస్తుండడంతో అంతా వెయిట్ చేస్తున్నారు.

త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ ఆ కథలో మెయిన్ ఎలిమెంట్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులపై కూడా టీమ్ ఎక్కువ దృష్టి పెట్టింది. ఇప్పటికే సినిమా జర్నీ అనుకున్న దానికంటే ఎక్కువ కాలం సాగింది. ఇప్పటికీ రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు. సంక్రాంతికి వస్తుందని వార్తలు వచ్చినా, అదే టైమ్ లో చిరంజీవి నటిస్తున్న కాకా మూవీ రిలీజ్ కానుంది. దీంతో విశ్వంభర రాక ఎప్పుడనేది తెలియదు.

అందుకే ఫ్యాన్స్ కొత్త అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ అధికారికంగా అప్డేట్స్ రాకపోయినా.. సినిమా పేరు మాత్రం ఎప్పటికప్పుడు చర్చలోకి వస్తోంది. దర్శకుడి పోస్టులు, పాత కంటెంట్, అభిమానుల చర్చలు ఇలా ఏదో ఒక కారణంతో విశ్వంభర సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇది ఆ సినిమాకు స్పెషల్ సిచ్యువేషన్ గా మారింది. సాధారణంగా ఎక్కువ కాలం ప్రమోషనల్ కంటెంట్ లేకపోతే ఇంట్రెస్ట్ తగ్గే అవకాశం ఉంటుంది.

కానీ విశ్వంభర విషయంలో మాత్రం చిన్న సమాచారం వచ్చినా అభిమానులు వెంటనే దానిపై డిస్కస్ చేస్తున్నారు. వశిష్ట పోస్ట్ కూడా ఇందుకు ఎగ్జాంపుల్. దర్శకుడు శివుడిని ఉద్దేశించి ఇంత పోస్ట్ చేసిన నేపథ్యంలో.. త్వరలో సినిమా నుంచి ఏదైనా కీలక అప్డేట్ బయటకు వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. అది కొత్త పోస్టరా.. గ్లింప్సా.. మరేదైనా అప్డేటా అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఇవన్నీ రూమర్లుగానే చూడాలి.