మెగా వారసుడు.. స్పెషల్ మూమెంట్స్ వైరల్
మెగా కుటుంబంలో కొత్త ఆనందం వెల్లివిరిసింది. హీరో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి దంపతులు పండంటి బిడ్డకు తల్లిదండ్రులయ్యారు.
By: M Prashanth | 10 Sept 2025 5:41 PM ISTమెగా కుటుంబంలో కొత్త ఆనందం వెల్లివిరిసింది. హీరో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి దంపతులు పండంటి బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. ఈ శుభవార్త బయటకొచ్చిన దగ్గరనుంచే సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. మెగా అభిమానులు మాత్రమే కాదు, సినీ వర్గాలంతా ఈ జంటపై ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు.
ఈ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ స్వయంగా మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో బిడ్డను కౌగిలించుకుని ఉన్న ఫోటోని షేర్ చేస్తూ, “ఈ లోకానికి స్వాగతం, లిటిల్ వన్.. కొణిదెల కుటుంబానికి హృదయపూర్వక స్వాగతం. వరుణ్ లావణ్య తల్లిదండ్రులైనందుకు శుభాకాంక్షలు. నాగబాబు, పద్మజలకు తాతయ్య, నానమ్మ బిరుదులు రావడం ఆనందంగా ఉంది” అని అన్నారు. చిన్నారికి ఆరోగ్యం, ఆనందం, ఆశీర్వాదాలు ఎప్పటికీ లభించాలని కోరుకున్నారు.
వరుణ్ తేజ్ కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఫ్యాన్స్‌తో ఆనందాన్ని పంచుకున్నాడు. లావణ్యతో కలిసి బిడ్డను ఆలింగనం చేసుకుంటున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేస్తూ, “మా చిన్నారి బాబు” అంటూ ప్రేమతో నిండిన మెసేజ్ పెట్టాడు. ఆ పోస్టు కాసేపట్లోనే వైరల్ అవ్వడంతో అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇంతలో, చిన్నారిని కౌగిలించుకున్న చిరంజీవి ఫొటోలు ఫ్యాన్స్‌కి మరింత ఎమోషనల్ మోమెంట్‌గా మారాయి. కొందరు ఫ్యాన్స్ “ఇదే నిజమైన మెగా లెగసీ” అని కామెంట్లు చేస్తుండగా, మరికొందరు “చిరంజీవి కౌగిలిలో మొదటి మూడోతరం మెగా వారసుడు” అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా అంతా వరుణ్, లావణ్య బాబు పుట్టిన సందర్భంగా మెగా ఫ్యామిలీకి శుభాకాంక్షలతో నిండిపోయింది.
ప్రస్తుతం వరుణ్ తేజ్ కెరీర్ పరంగా కూడా బిజీగా ఉన్నాడు. హారర్ కామెడీ జానర్‌లో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటిస్తుండగా, లావణ్య త్రిపాఠి “టన్నెల్” అనే సినిమాలో కనిపించనుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 19న విడుదల చేయనున్నారు.
