Begin typing your search above and press return to search.

అసలే స్లిమ్.. ఇంకెంత సన్నబడతావ్ వరుణ్?

ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తున్న కొరియన్ కనకరాజు సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

By:  M Prashanth   |   10 Jun 2026 8:00 AM IST
అసలే స్లిమ్.. ఇంకెంత సన్నబడతావ్ వరుణ్?
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి తన లుక్‌ తో వార్తల్లో నిలిచేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే స్లిమ్ ఫిజిక్‌ తో కనిపించే వరుణ్.. ఇప్పుడు తన కొత్త మూవీ కోసం మరింత వెయిట్ తగ్గబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారాయి. రోల్ కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధపడే హీరోల్లో వరుణ్ కూడా ఒకరని ఆ విషయం మరోసారి గుర్తు చేస్తోంది.

ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తున్న కొరియన్ కనకరాజు సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన ప్యాచ్‌ వర్క్, బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసిన వెంటనే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ బరి మూవీపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఆ మూవీకి సంబంధించిన ఆసక్తికర అంశం వరుణ్ లుక్ అని చెప్పాలి. కథ ప్రకారం హీరో పాత్ర చాలా లీన్‌ గా, అల్ట్రా ఫిట్‌ గా కనిపించాల్సిన అవసరం ఉందట.

అందుకే దర్శకుడు కూడా పాత్రకు తగ్గట్టుగా బరువు తగ్గాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. కథపై నమ్మకం, పాత్రపై ఆసక్తితో వరుణ్ తేజ్ కూడా ఆ సవాల్‌ ను రిసీవ్ చేసుకునేందుకు సిద్ధమైనట్లు ఇప్పుడు నెట్టింట చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటికే వరుణ్ తేజ్ నార్మల్ గానే స్లిమ్‌ గా కనిపిస్తుంటారు. అలాంటి హీరో ఇప్పుడు ఇంకా వెయిట్ తగ్గుతారనే వార్త మెగా ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

"ఇంకా ఎంత సన్నబడతావ్ వరుణ్?" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు, రోల్ లో కోసం తనను తాను మార్చుకోవడంలో ఆయన చూపిస్తున్న డెడికేషన్ ను మెగా ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. గతంలో కూడా వరుణ్ తేజ్ కొన్ని పాత్రల కోసం తన లుక్‌ లో చాలా చేంజెస్ చేశారు. అయితే ఈసారి మాత్రం కంప్లీట్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

దీనికోసం ఆయన ప్రత్యేక ఫిట్నెస్ ప్రోగ్రామ్‌ ను ఫాలో అయ్యే అవకాశం ఉందని సమాచారం. దాదాపు రెండు నెలల పాటు ఇతర వర్క్ కు దూరంగా ఉంటూ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ పై దృష్టి పెట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక కొరియన్ కనకరాజు విడుదల విషయంలో కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందని టాక్ ఉన్నప్పటికీ, దీనిపై మూవీ టీమ్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.

ఆ సినిమా పనులు పూర్తయిన తర్వాతే బరి షూటింగ్‌ కు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ సమాచారం అంతా అధికారికంగా ఏం రాలేదు. కానీ రోల్ కోసం కొత్త ప్రయోగాలకు వెనుకాడని వరుణ్ తేజ్, నిజంగానే మరో భారీ మేకోవర్‌ కు సిద్ధమైతే మాత్రం బరిపై అంచనాలు మరింత పెరగడం ఖాయం. ఇప్పటికే స్లిమ్‌ గా కనిపించే మెగా హీరో.. నిజంగానే ఇంకాస్త బరువు తగ్గితే స్క్రీన్ పై ఎలా కనిపిస్తారన్న ఆసక్తి నెలకొంది.