ఇండస్ట్రీలో వారిద్దరి తర్వాత మాదే హిట్ కాంబో - వరుణ్ తేజ్!
అందులో భాగంగానే ఇండస్ట్రీలో తన పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్ తర్వాత హిట్ కాంబో తమదే అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..
By: Madhu Reddy | 4 Aug 2026 2:59 PM ISTమెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ తొలిసారి తన కెరీర్లో హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఇండో కొరియన్ నేపథ్యంలో కొరియన్ కనకరాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆగస్టు 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వరుస ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు. అందులో భాగంగానే ఇండస్ట్రీలో తన పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్ తర్వాత హిట్ కాంబో తమదే అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..
ఇండస్ట్రీలో మాదే హిట్ కాంబో - వరుణ్ తేజ్
కొరియర్ కనకరాజు మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ప్రతి ఆడియన్ కి నచ్చే కథ ఇది. ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా మెప్పిస్తుంది. కష్టాలన్నీ పక్కనపెట్టి థియేటర్కి వచ్చే వారికి మంచి ఎంటర్టైన్మెంట్ ను , కామెడీని ఈ సినిమా ఇస్తుంది. ఇక సత్య విషయానికి వస్తే.. ఇండస్ట్రీలో మాదే హిట్ కాంబో. పవన్ కళ్యాణ్ బాబాయ్ కి అలీ, చిరంజీవి గారికి బ్రహ్మానందం, వారి మాదిరిగా నాది - సత్య కాంబినేషన్ కూడా అంతే బాగా సెట్ అయింది. అందరూ కూడా చాలా గొప్ప నటీనటులే. అయితే యూనిక్ కాంబినేషన్ లో మాది కూడా ఒకటి అని నేను స్పష్టంగా చెప్పగలను" అంటూ వరుణ్ తేజ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి చెప్పినట్టుగా ఈ కాంబో సినిమాలో ఏ విధంగా ఆడియన్స్ ను మెప్పిస్తుందో చూడాలి.
కొరియన్ కనకరాజు సినిమా విశేషాలు..
ఎంటర్టైనింగ్ చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న మేర్లపాక గాంధీ తాజాగా రూపొందించిన చిత్రమిది. ఆగస్టు 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితిక నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. యు వి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రంలో సత్య కీలక పాత్ర పోషిస్తున్నారు.
కొరియన్ కనగరాజు స్టోరీ అక్కడ నుండి పుట్టింది- డైరెక్టర్
ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. కొన్నాళ్ల క్రితం నేను నా స్నేహితులతో కలిసి అనంతపురం మీదుగా పెళ్లికి వెళ్తూ కియా ఫ్యాక్టరీ వద్ద ఆగాము. అక్కడ పనిచేసే కొరియన్ల కోసం ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీతో పాటు వాళ్ళ కల్చర్ కి తగ్గట్టుగా రెస్టారెంట్లు, మార్కెట్లు ఉన్నాయని తెలిసింది. అప్పుడే ఒక కొరియన్ ఆత్మ అనంతపురం కుర్రాడిని ఆవహిస్తే ఎలా ఉంటుంది? అక్కడినుంచి ఎలాంటి కామెడీ పడుతుంది? అనే ఆలోచనతోనే స్టోరీని రెడీ చేశాను.
రెండు విభిన్న షేడ్స్ లో వరుణ్ తేజ్..
ఇందులో వరుణ్ తేజ్ రెండు డిఫరెంట్ పాత్రల్లో చాలా అద్భుతంగా ఒదిగిపోయాడు. అనంతపురం యాస మాట్లాడడం, కొరియన్ భాష రెండు ఆయనకు కొత్తే.. ఆత్మ ఆవహించిన తర్వాత క్యారెక్టర్ బిహేవియర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో ఆయన లీనమైపోయాడు. అంటూ స్టోరీ మూలాలను బయటపెట్టారు.
