Begin typing your search above and press return to search.

ఫ్లాపుల వెనుక అసలు నిజాలు చెప్పేసిన మెగా హీరో

కొరియన్ కనకరాజు సినిమా రిలీజ్ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ గ్యాప్ లేకుండా వరుసగా ప్రమోషన్ లో పాల్గొంటున్నాడు.

By:  M Prashanth   |   6 Aug 2026 9:28 AM IST
ఫ్లాపుల వెనుక అసలు నిజాలు చెప్పేసిన మెగా హీరో
X

కొరియన్ కనకరాజు సినిమా రిలీజ్ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ గ్యాప్ లేకుండా వరుసగా ప్రమోషన్ లో పాల్గొంటున్నాడు. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గత చిత్రాలైన మట్కా, ఆపరేషన్ వాలెంటైన్, గాండీవధారి అర్జున సినిమాల బాక్సాఫీస్ ఫలితాలపై ఎలాంటి దాపరికం లేకుండా చాలా ఓపెన్ గా మాట్లాడారు. వరుస పరాజయాల తర్వాత ప్రేక్షకుల పల్స్ ను అర్థం చేసుకునే క్రమంలో వరుణ్ ఆలోచించిన విధానం రియాలిటీకి దగ్గరగానే ఉందనిపిస్తోంది.

ముఖ్యంగా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన 'మట్కా' సినిమా విషయంలో మొదటి నుంచే జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేదని, ప్రిఫరెన్స్ ఇవ్వలేదని ఒప్పుకున్నారు. ఆ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా లేకపోయిందని అన్నారు. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే జనాలు తన నుంచి ఇలాంటి సీరియస్ సినిమాలు ఆశించడం లేదనే విషయం వాళ్ళ జెన్యూన్ రియాక్షన్స్ చూశాక స్పష్టంగా అర్థమైందని వివరించారు.

రొటీన్ కు భిన్నంగా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేసిన 'మట్కా', 'గాండీవధారి అర్జున', 'ఆపరేషన్ వాలెంటైన్' లాంటి సినిమాలు కేవలం ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కు మాత్రమే పరిమితం అయ్యాయని వరుణ్ తేజ్ తెలిపారు. లార్జ్ స్కేల్ లో ఆలోచిస్తే ఒక సినిమా అనేది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉండాలని తన మనసులోని మాటను బయటపెట్టారు.

'ఆపరేషన్ వాలెంటైన్' లాంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ కథ కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదంటే ఆయా సినిమాల్లో కచ్చితంగా తమ తప్పులు ఉన్నాయని నిజాయితీగా అంగీకరించారు. గతంలో తాను కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేసినప్పుడే ఎక్కువ సక్సెస్ అయ్యానని, ఆడియన్స్ కు ఎప్పుడూ వినోదం కావాలనే బేసిక్ పాయింట్ ను తాను మిస్ అయ్యానని స్పష్టం చేశారు.

మారుతున్న ట్రెండ్స్ తో పాటు జనాలకు ఎలాంటి కంటెంట్ కావాలో ఎప్పటికప్పుడు అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా సినిమాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని వరుణ్ తేజ్ తెలిపారు. సీరియస్ అండ్ యాక్షన్ కథల వల్ల వచ్చిన ఫెయిల్యూర్స్ తో సరైన పాఠాలు నేర్చుకుని, మళ్లీఎంటర్టైన్మెంట్ పంచే కథల వైపు తన అడుగులు వేస్తున్నట్లు వరుణ్ మాటలను బట్టి అర్థమవుతుంది.

గత తప్పులను సరిదిద్దుకుంటూ ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త చిత్రమే 'కొరియన్ కనకరాజు' అని వరుణ్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా అన్ని వయసుల వారికి, అన్ని వర్గాల ప్రేక్షకులకు వంద శాతం నచ్చేలా ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా ఎంజాయ్ చేసేలా ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేసినట్లు, అందరినీ నవ్వించడమే ఈ సినిమా మెయిన్ టార్గెట్ అని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.