చెల్లెలు అయినా ఆ విషయంలో అన్నయ్య నో రాజీ!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవలే `కొరియన్ కనకరాజ్` విజయంతో మంచి కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 22 Aug 2026 8:00 AM ISTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవలే `కొరియన్ కనకరాజ్` విజయంతో మంచి కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా సరైన విజయాలు లేని హీరోకి ఈ సక్సెస్ మంచి ఉత్సాహాన్ని నింపింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో తదుపరి ప్రాజెక్ట్ లకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సోదరి నిహారిక కొణిదెల బ్యానర్ లో `బరి` అనే సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ నేపథ్యంలోప్రాజెక్ట్ గురించి వరుణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
సొంత చెల్లెలు సినిమా నిర్మిస్తున్నప్పటికీ తన పారితోషికంలో ఎలాంటి రాయితీ ఇచ్చే ప్రసక్తే లేదని వరుణ్ తేల్చి చెప్పారు. సోదరి అయినంత మాత్రాన తనకు ఏ ప్రత్యేక డిస్కౌంట్లు వర్తించవని పూర్తి పారితోషికాన్ని ఆమె చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. కుటుంబ బంధాలు వేరు, వృత్తిపరమైన విషయాలు వేరు అని వరుణ్ తేజ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నిర్మాణ రంగంలో బడ్జెట్ .. లెక్కలు పక్కాగా ఉండాలని అందుకే తాను ప్రొఫెషనల్‌గా పూర్తి రెమ్యునరేషన్‌నే డిమాండ్ చేస్తున్నట్లు సరదాగా పేర్కొన్నారు. ఒక సోదరుడిగా ఆమెకు మద్దతు ఇస్తున్నా? వ్యాపార పరంగా మాత్రం ఎలాంటి రాజీపడేది లేదని వరుణ్ తేల్చిచెప్పారు.
మరోవైపు మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. నటిగా మాత్రమే కాకుండా విభిన్నమైన కంటెంట్‌తో సినిమాలు నిర్మిస్తూ టాలీవుడ్‌లో నిర్మాతగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. సోదరుడు వరుణ్ తేజ్‌తో సినిమా చేయడం తనకెంతో సంతోషాన్నిస్తోందని ఆయన సినిమాలకు తగిన ప్రతిఫలం ఇవ్వడం నిర్మాతల బాధ్యత అని పలు సందర్భాల్లో తెలిపారు. కుటుంబ సభ్యులే చిత్ర పరిశ్రమలో ఇలా విభిన్న విభాగాల్లో పనిచేస్తూ పరస్పరం సహకరించుకోవడం మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
హీరో వరుణ్ తేజ్ -నిర్మాత నిహారికల మధ్య ఉన్న ఈ ప్రొఫెషనల్ బాండింగ్ .. సరదా సంభాషణలు నెటిజన్లను అలరిస్తున్నాయి. నిహారిక అగ్ర హీరోతో నిర్మిస్తోన్న తొలి సినిమా ఇదే కావడంతో? ఎక్కడా రాజీ లేకుండా పనిచేస్తున్నారు. బడ్జెట్ పరంగా ఎంత ఖర్చైనా పెట్టడానికి సిద్దంగానే ఉన్నారు. నిర్మాతగా ఇప్పటికే కథల విష|యంలో తనకంటూ ప్రత్యేకమైన టేస్ట్ ఉందని నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో `బరి` విషయంలో కూడా నిహారిక జడ్జిమెంట్ పై మెగా అభిమానులంతా ఎంతో నమ్మకంగా ఉన్నారు. అన్నయ్యకు ఈ సినిమాతో గనుక మంచి విజయం అందిస్తే.. మిగతా మెగా హీరోలు క్యూ కడతారు. అలాగే బయట హీరోలు కూడా నిహారిక కథలపై నమ్మకంగా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది.
