Begin typing your search above and press return to search.

న్యూ ఇయర్ సందర్భంగా అలాంటి పని చేసిన మెగా జోడి!

కొత్త ఏడాది ప్రారంభమైన సందర్భంగా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు తమ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   2 Jan 2026 7:45 PM IST
న్యూ ఇయర్ సందర్భంగా అలాంటి పని చేసిన మెగా జోడి!
X

కొత్త ఏడాది ప్రారంభమైన సందర్భంగా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు తమ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ప్రిన్స్ మెగా హీరో వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠితో పాటు తన కొడుకు వాయువ్ తేజ్ కొణిదెలతో కలిసి ఈ న్యూ ఇయర్ ను చాలా కొత్తగా జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భార్య, కొడుకుతో కలిసి వెకేషన్ కి వెళ్లారు వరుణ్ తేజ్.




కొడుకు పుట్టిన తర్వాత పెద్దగా వెకేషన్ కి వెళ్ళని ఈ జంట తొలిసారి ఇలా బీచ్ ట్రిప్ కి వెళ్లి తమ కొడుకుతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను వరుణ్ తేజ్ తాజాగా సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో.. అభిమానులు ఈ మెగా కుటుంబానికి సంబంధించిన ఫోటోలు చూసి తెగ వైరల్ చేస్తూ.. క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వరుణ్ తేజ్ విషయానికి వస్తే.. మెగా హీరోగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మిస్టర్, అంతరిక్షం వంటి సినిమాలు చేస్తున్న సమయంలోనే లావణ్య త్రిపాఠితో ప్రేమలో పడ్డారు..చాలా కాలం ఆమెతో రహస్యంగానే ప్రేమాయణం సాగించారు. అయితే ఎప్పటికప్పుడు వీరికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయినా.. ఎవరు కూడా దీనిపై స్పందించే ప్రయత్నం చేయలేదు. కానీ వీరే స్వయంగా 2023 జూన్ 9న హైదరాబాదులోని నాగబాబు ఇంట్లో కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత అదే ఏడాది నవంబర్ 1న ఇటలీ లోని సియెనా లోని బోర్గోశాన్ ఫెలిసీ రిసార్ట్‌ లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు గత ఏడాది 2020 సెప్టెంబర్ 10న హైదరాబాద్లోని రెయిన్బో హాస్పిటల్ లో కుమారుడు జన్మించారు. దసరా పండుగ సందర్భంగా తమ కొడుకుకి వాయువ్ తేజ్ కొణిదెలగా నామకరణం చేశారు ఈ జంట.

వరుణ్ తేజ్ ప్రస్తుతం ఇండో కొరియన్ సహకారంతో VT 15 అనే ఒక మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం భారతీయ కొరియన్ కథనాలను మిళితం చేస్తూ తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ ఏడాది ముహూర్త పూజతో ప్రారంభించనున్నారు. అలాగే కరుణకుమార్ దర్శకత్వంలో ఒక క్రైమ్ డ్రామా మూవీని తెరకెక్కించనున్నారు. ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ కొత్తగా అడుగులు వేస్తున్నారు వరుణ్ తేజ్. ఇక లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే.. ఇటీవల మిస్ పర్ఫెక్ట్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. సతీలీలావతి అనే చిత్రంలో కూడా నటించింది. ఇందులో దేవ్ మోహన్ నటించగా తాతినేని సత్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు.