మెగా ప్రిన్స్ ఇండో-కొరియన్ ప్రయోగం.. గ్లింప్స్ డేట్ ఫిక్స్!
ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాపై ఇండస్ట్రీలో మంచి బజ్ ఉంది. టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచే ఈ ప్రాజెక్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.
By: M Prashanth | 17 Jan 2026 3:21 PM ISTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొదటి నుంచి కూడా డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. రొటీన్ మాస్ మసాలా సినిమాల కంటే డిఫరెంట్ కాన్సెప్ట్‌లకే ఆయన ఓటు వేస్తుంటారు. రిజల్ట్ ఎలా ఉన్నా, కథలో కొత్తదనం చూపించడంలో ఎప్పుడూ ముందుంటారు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాపై ఇండస్ట్రీలో మంచి బజ్ ఉంది. టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచే ఈ ప్రాజెక్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.
హారర్ కామెడీ జానర్ అంటే ప్రేక్షకులకు ఒక అంచనా ఉంటుంది. కానీ ఈసారి వరుణ్ తేజ్ ఏకంగా ఇండో కొరియన్ క్రాస్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నారు. కామెడీ టైమింగ్‌లో తనదైన మార్క్ ఉన్న మేర్లపాక గాంధీ, ఈ హారర్ కామెడీని కొత్తగా హైలెట్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది.
లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను జనవరి 19న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి కొరియన్ స్టైల్ డ్రాగన్ బొమ్మ ఉన్న ఒక బాక్స్‌ను పట్టుకుని ఉండటం మిస్టరీని పెంచుతోంది.
ఈ సినిమాలో కమెడియన్ సత్య ఒక ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
సత్య వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన ప్రమోషనల్ వీడియో ఇప్పటికే నవ్వులు పూయించింది. అయితే ఇప్పటివరకు వరుణ్ తేజ్ లుక్‌ను మాత్రం రివీల్ చేయకుండా మేకర్స్ సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. వియత్నాం వంటి లొకేషన్లలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా విజువల్ గా కూడా కొత్తగా ఉండబోతోంది.
యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు '#KOKA' అనే హ్యాష్‌ట్యాగ్ వాడుతుండటం గమనార్హం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా, ఇండియన్ సినిమాకే ఒక కొత్త రకమైన క్రాస్ కల్చర్ సినిమాను అందిస్తున్నామని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఆ మిస్టరీ బాక్స్‌లో ఏముంది? వరుణ్ తేజ్ ఈసారి ఎలాంటి గెటప్‌లో కనిపించబోతున్నారు? అనేది తెలియాలంటే జనవరి 19 వరకు ఆగాల్సిందే.
