Begin typing your search above and press return to search.

వరుణ్ తేజ్ కాన్ఫిడెన్స్ వర్కౌట్ అవుతుందా?

మెగా కాంపౌండ్ లో ఇప్పుడు మంచి జోష్ కనిపిస్తోంది. రెండేళ్ల క్రితం వరుసగా రెండు మూడు ఫ్లాపులతో ఫ్యామిలీ అంతా కాస్త డల్ ఫేజ్ చూసిన మాట వాస్తవమే.

By:  M Prashanth   |   5 Aug 2026 9:49 AM IST
వరుణ్ తేజ్ కాన్ఫిడెన్స్ వర్కౌట్ అవుతుందా?
X

మెగా కాంపౌండ్ లో ఇప్పుడు మంచి జోష్ కనిపిస్తోంది. రెండేళ్ల క్రితం వరుసగా రెండు మూడు ఫ్లాపులతో ఫ్యామిలీ అంతా కాస్త డల్ ఫేజ్ చూసిన మాట వాస్తవమే. కానీ ఆ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. వరుస సక్సెస్ లతో హీరోలంతా ఫుల్ ట్రాక్ లోకి వచ్చేశారు. మొన్న జరిగిన కొరియన్ కనకరాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ తేజ్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

పవన్ కళ్యాణ్ ఓజీ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ కొట్టి ఈ సక్సెస్ ట్రాక్ కు గట్టి పునాది వేసింది. ఆ తర్వాత సంక్రాంతి బరిలో వచ్చిన చిరంజీవి మన శంకర వర ప్రసాద్ థియేటర్లలో కలెక్షన్స్ తో ఊహించని రికార్డులను అందుకుంది. మధ్యలో పవన్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఆశించిన స్థాయిలో రిజల్ట్ ఇవ్వకపోయినా ఆ ఇంపాక్ట్ మిగతా సినిమాల మీద పెద్దగా పడలేదు. మెగా హీరోల మార్కెట్ స్ట్రాంగ్ గానే నిలబడింది.

రామ్ చరణ్ సినిమా పెద్ధితో ఈ సక్సెస్ గ్రాఫ్ మరింత పైకి వెళ్ళింది. ఈ సినిమాలో చరణ్ పెర్ఫార్మన్స్ కు ఆడియన్స్ పూర్తిగా ఫిదా అయ్యారు. ఓపెనింగ్స్ లెక్కలతో పాటు నటుడిగా చరణ్ కు చాలా మంచి పేరు రావడం మెగా ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. ఇలా ఫ్యామిలీలో అందరు హీరోలు బ్యాక్ టు బ్యాక్ పాజిటివ్ గా ఫుల్ ఫామ్ లో ఉండటం విశేషం.

ఇదే విషయాన్ని వరుణ్ తేజ్ ఎక్కడా దాచకుండా చాలా ఓపెన్ గా ఒప్పుకున్నాడు. వాళ్ళ రేంజ్ లో కాకపోయినా తనదైన స్టైల్ లో ఆ సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేస్తానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ సెట్ చేసుకున్న వరుణ్ ఎప్పటిలాగే ఒక కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. ఫ్యామిలీ హిట్ సెంటిమెంట్ ను తాను కూడా ఈసారి కచ్చితంగా రిపీట్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు.

కొరియన్ కనకరాజు కంటెంట్ మీద వరుణ్ కు ఉన్న నమ్మకం మామూలుగా లేదు. రిలీజ్ కు ఒకరోజు ముందే ధైర్యంగా ప్రీమియర్స్ వేయడానికి రెడీ అయ్యారు అంటే సినిమా ఔట్ పుట్ మీద టీమ్ కు ఎంత గ్రిప్ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. హారర్ కామెడీ జానర్ లో వస్తున్న ఈ సినిమా జెన్ జీ ఆడియన్స్ కు కనెక్ట్ అయితే మాత్రం సాలిడ్ ఓపెనింగ్స్ రావచ్చు.

ఎలాంటి ఓవర్ హైప్ కు పోకుండా చాలా బ్యాలెన్స్డ్ గా ప్రమోషన్స్ చేసుకుంటూ వస్తున్న ఈ టీమ్ ప్రాక్టికల్ గానే అడుగులు వేస్తోంది. వరుణ్ తేజ్ చెప్పినట్లు మెగా సక్సెస్ ఫ్లోను కొరియన్ కనకరాజు ముందుకు తీసుకెళ్తుందా లేదా అనేది మరో కొన్ని గంటల్లోనే తేలిపోతుంది. ప్రీమియర్స్ తోనే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం మెగా ఫ్యామిలీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరినట్లే అనుకోవాలి.