కాలికి గాయంతో బాధపడుతున్న వరుణ్ తేజ్.. అసలు విషయం బయటకు!
టాలీవుడ్ లో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు.
By: Madhu Reddy | 20 July 2026 11:14 AM ISTటాలీవుడ్ లో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు. ముఖ్యంగా అందులో చాలామంది మంచి సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతుంటే.. మెగా హీరోలలో ఒకరిగా నిలిచిన ప్రిన్స్ వరుణ్ తేజ్ కి మాత్రం అదృష్టం కలిసి రాలేదు. గత కొంతకాలంగా ఆయన నటిస్తున్న ఏ చిత్రం కూడా ఆయనకు విజయాన్ని అందించలేదు. దీంతో జానర్ మార్చి కామెడీ హారర్ బ్యాక్ డ్రాప్ లో ఇండో కొరియన్ నేపథ్యంలో 'కొరియన్ కనకరాజు' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆగస్టు 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర బృందం.. మొదటిపాటుతో ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. జూలై 19వ తేదీన 'రస గుమ్మడి' అనే రెండవ పాటను రిలీజ్ చేశారు. రాయలసీమ అనంతపురంలో ఈ పాట రిలీజ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఇకపోతే అనంతపురం నేపథ్యంలోనే కొరియన్ కనకరాజు సినిమా కథకు ఊపిరి లభించిందని, ఇక ఇక్కడి నుండే ప్రమోషన్స్ మొదలుపెట్టడం మంచిది అనుకొని.. ఇక్కడ నుంచే ప్రారంభించాం అంటూ వరుణ్ తేజ్ తెలిపారు. అయితే ఇదే సమయంలో ఆయన చేతి కర్రతో నడుచుకుంటూ స్టేజ్ పైకి రావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు వరుణ్ తేజ్ కు ఏమైంది? సడన్గా ఇలా చేతి కర్రతో కనిపించడం ఏంటి? అంటూ అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వరుణ్ తేజ్ ఇలా చేతి కర్రతో కనిపించడం వెనక అసలు కారణాన్ని కూడా ఆయనే బయటపెట్టారు.
సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో భాగంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. "మెగాస్టార్ చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని సినిమాలో పాటల కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే, నా కాలికి గాయమయ్యింది. ఈ కాలికి గాయం అవ్వడం వల్లే ఇప్పుడు మీతో కలిసి నన్ను ఈ స్టేజిపై స్టెప్పులు వేయలేకపోతున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే వరుణ్ తేజ్ కాలికి దెబ్బ తగిలిందని తెలియడంతో మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయం అయినప్పటికీ కూడా సినిమా ప్రమోషన్స్ కోసం అనంతపురం వరకు వచ్చి ఈవెంట్లో పాల్గొనడంపై సినిమా పట్ల ఆయనకున్న డెడికేషన్ ను మెచ్చుకుంటున్నారు. త్వరగా వరుణ్ తేజ్ కోలుకోవాలని, ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకొని స్టార్ హీరోగా నిలదొక్కుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.
కొరియన్ కనకరాజు సినిమా విషయానికి వస్తే.. మేళ్లపాక గాంధీ దర్శకత్వంలో రాబోతున్న హార్రర్ కామెడీ మూవీ. ఇందులో మిరాయ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ప్రముఖ కమెడియన్ సత్యా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వై రాజీవ్ రెడ్డి, సాయి జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యు.వీ. క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్ ఉప్పలపాటి, వంశీకృష్ణ రెడ్డి కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక సంగీతాన్ని ఎస్.తమన్ అందిస్తున్నారు. మరి ఆగస్టు 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొరియన్ కనకరాజు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
