Begin typing your search above and press return to search.

ఒక రోజంతా మెగా కోడ‌లు క‌ఠిన ఉప‌వాసం.. దేనికోస‌మో తెలుసా?

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అనగానే టక్కున గుర్తుకొచ్చే జోడీలలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, గ్లామరస్ నటి లావణ్య త్రిపాఠి ఒకరు.

By:  Sivaji Kontham   |   30 Oct 2026 8:28 PM IST
ఒక రోజంతా మెగా కోడ‌లు క‌ఠిన ఉప‌వాసం.. దేనికోస‌మో తెలుసా?
X

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అనగానే టక్కున గుర్తుకొచ్చే జోడీలలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, గ్లామరస్ నటి లావణ్య త్రిపాఠి ఒకరు. రీల్ లైఫ్‌లో ప్రేక్షకాభిమానాన్ని పొందిన ఈ జంట.. రియల్ లైఫ్‌లోనూ ఒకటైనప్పటి నుంచి సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్‌లోనే ఉంటున్నారు. తాజాగా లావణ్య త్రిపాఠి తన భర్త వరుణ్ తేజ్ కోసం నిర్వహించిన కర్వా చౌత్ వేడుకలకు సంబంధించిన ఒక అద్భుతమైన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసారు.





ఈ ప్రత్యేకమైన పోస్ట్‌కి లావణ్య ఒక ఎమోషనల్ అండ్ బ్యూటిఫుల్ క్యాప్షన్‌ను జత చేశారు. ``నా జీవితాన్ని మరింత ఆనందమయంగా... నా రోజులను నవ్వులతో నింపుతూ... నా హృదయాన్ని పరిపూర్ణంగా మార్చే వ్యక్తి కోసం కర్వా చౌత్ వేడుకలు! అంటూ తన ప్రేమను చాటుకున్నారు. భర్తపై ఉన్న అపారమైన అనురాగాన్ని వ్యక్తపరుస్తూ ఆమె చేసిన ఈ పోస్ట్ నెటిజన్లతో పాటు మెగా అభిమానుల హృదయాలను అమితంగా ఆకట్టుకుంది.





ఈ పోస్ట్ వెలువడిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. క్యూట్ అండ్ క్యూటెస్ట్ మెగా కపుల్ అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు. ఇద్దరూ కలిసి ఎంతో గ్లోయింగ్‌గా, ముచ్చటగా ఉన్నారంటూ లైక్‌లు, హార్ట్ ఈమోజీలతో కామెంట్ సెక్షన్‌ను నింపేశారు. ఈ జంట మధ్య ఉన్న అనుబంధం - పవిత్రమైన ప్రేమను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.





చిత్ర పరిశ్రమలోనే అత్యంత అండర్‌రేటెడ్ సెలబ్రిటీ కపుల్ మీరేనంటూ పలువురు అభిమానులు వ్యాఖ్యానించగా.. మరికొందరు `గాడ్ బ్లెస్ యు` అంటూ ఈ క్రేజీ పెయిర్‌కు శుభాకాంక్షలు అందించారు. ఉత్తరాది సంప్రదాయమైన కర్వా చౌత్‌ను లావణ్య ఎంతో భక్తిశ్రద్ధలతో, ప్రేమతో నిర్వహించడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

పెళ్లి తర్వాత కూడా ఒకరికొకరు సపోర్ట్‌గా నిలుస్తూ.. వృత్తిపరమైన జీవితంతో పాటు వ్యక్తిగత జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్న ఈ జంట సెలబ్రిటీలకు ఒక సరికొత్త ఆదర్శంగా నిలుస్తోంది. వరుణ్ తేజ్, లావణ్యల ఈ క్యూట్ పిక్ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ, ట్రెండింగ్ గా నిలిచింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. వ‌రుణ్ తేజ్ ఇటీవ‌లే `కొరియ‌న్ క‌న‌క‌రాజు` చిత్రంతో విజ‌యం అందుకున్నాడు. ఇదే హుషారులో మ‌రో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. వీటికి సంబంధించిన త‌దుప‌రి వివ‌రాలు అందాల్సి ఉంది. లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి త‌ర్వాతా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

ఏమిటి ఈ పండ‌గ ప్ర‌త్యేక‌త‌?

కర్వా చౌత్ అనేది ప్రధానంగా ఉత్తర భారతదేశంలో (పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో) వివాహిత మహిళలు ఎంతో నిష్ఠతో జరుపుకునే విశిష్టమైన హిందూ పండుగ. ఇందులో `కర్వా` అంటే పూజకు ఉపయోగించే మట్టి కుండ అని, `చౌత్` అంటే కార్తీక మాసంలో వచ్చే నాల్గవ రోజు (చవితి) అని అర్థం. ఈ రోజున ఇల్లాలు తమ భర్తల ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, శ్రేయస్సును కాంక్షిస్తూ రోజంతా నీరు కూడా తాగకుండా కఠిన ఉపవాసం ఉండి, సాయంత్రం పూజలు నిర్వహించిన అనంతరం... రాత్రి పూట జల్లెడ గుండా చంద్రుడిని.. తమ భర్తను దర్శించుకుని భర్త చేతుల మీదుగా నీరు తాగి ఉపవాసాన్ని విరమిస్తారు.