Begin typing your search above and press return to search.

కొరియన్ దెయ్యంతో వరుణ్ తేజ్ రచ్చ.. ట్రైలర్ బ్లాస్ట్!

వరుణ్ తేజ్ న్యూ మూవీ కొరియన్ కనకరాజు ట్రైలర్ వచ్చేసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే క్లియర్ గా అర్థమవుతోంది.

By:  M Prashanth   |   1 Aug 2026 2:43 PM IST
కొరియన్ దెయ్యంతో వరుణ్ తేజ్ రచ్చ.. ట్రైలర్ బ్లాస్ట్!
X

వరుణ్ తేజ్ న్యూ మూవీ కొరియన్ కనకరాజు ట్రైలర్ వచ్చేసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే క్లియర్ గా అర్థమవుతోంది. వరుణ్ తేజ్ చాలా కాలం తర్వాత ఒక పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ లో ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఆగస్టు 7న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా తాలూకు ట్రైలర్ ఆడియన్స్ ను బాగానే ఎంటర్టైన్ చేస్తోంది.




ఈ ట్రైలర్ స్టార్టింగ్ లోనే కమెడియన్ సత్య రక్తసిక్త పిశాచ కొరియన్ కనకరాజు దెయ్యం ఆవాహయామి అంటూ దెయ్యాన్ని పిలిచే సీన్ తో అసలు కథ మీద ఆసక్తిని క్రియేట్ చేశారు. పెనుగొండ అనే ఒక పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథలో వరుణ్ తేజ్ కనకరాజు అనే మాస్ కుర్రాడిగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత ఊహించని విధంగా ఒక కొరియన్ దెయ్యం అతని ఒంట్లో దూరడం వల్ల వచ్చే కమ్యూనికేషన్ గ్యాప్ తో కథను చాలా ఫన్నీగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

దెయ్యం పట్టిన తర్వాత వరుణ్ తేజ్ అందరితో కొరియన్ భాషలో మాట్లాడుతూ వాళ్లకు పిచ్చెక్కించే సీన్స్ ట్రైలర్ లో బాగా నవ్విస్తాయి. కమ్యూనికేషన్ గ్యాప్ అని ఒక క్యారెక్టర్ చాలా సీరియస్ గా చెప్పే డైలాగ్ ఈ సినిమా అసలు కాన్సెప్ట్ ఏంటో సింపుల్ గా చెబుతుంది. హీరోలో దెయ్యం చేరడం ఆ తరువాత భాష రాకపోవడం అనే పాయింట్ మీద కామెడీ బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తోంది.

ఈ ట్రైలర్ లో సత్య కామెడీ టైమింగ్ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. సత్య చెప్పే డైలాగ్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. అలాగే ఈ పచ్చబొట్టు ఏంది.. నా మీసం ఏది.. జాతర్ల కోడిపుంజుని తయారు చేసినట్టు చేసినారు అని తన కొత్త గెటప్ చూసుకుని వరుణ్ కన్ఫ్యూజ్ అవుతూ చెప్పే మాటలు కూడా ఆడియన్స్ లో ఫన్ జనరేట్ చేస్తున్నాయి.

ఇక కేవలం కామెడీ మాత్రమే కాకుండా సెకండ్ హాఫ్ లో మంచి స్టైలిష్ యాక్షన్ కూడా ఉన్నట్లు ట్రైలర్ లో చూపించారు. దెయ్యం పట్టిన తర్వాత ఒక బ్లాక్ సూట్ లో కొరియన్ వీధుల్లో వరుణ్ చేసే యాక్షన్ ఫైట్స్ విజువల్ గా చాలా రిచ్ గా ఉన్నాయి. నరకం ఎట్లుంటదో చూపిస్తా నా కొడుక్కి అని వరుణ్ చెప్పే డైలాగ్ సినిమాలో ఎమోషన్ తో పాటు యాక్షన్ డోస్ కూడా గట్టిగానే ఉందని హింట్ ఇస్తోంది. తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సీన్స్ కు బాగా సెట్ అయింది.

యూవీ క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. మొత్తానికి మేకర్స్ ఎలాంటి అనవసరమైన బిల్డప్స్ లేకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో పక్కా ఎంటర్టైనర్ లా ఈ సినిమాను తీశారని ఈ వీడియోతో క్లారిటీ ఇచ్చారు. ఈ హారర్ కామెడీ థియేటర్లలో ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.