వరుణ్ 'కొరియన్ కనకరాజు' టీజర్.. రాయలసీమ టు కొరియా హారర్
టీజర్ లో మరో స్పెషాలిటీ కామెడీ. ముఖ్యంగా వరుణ్ తేజ్, సత్య మధ్య వచ్చే సన్నివేశాలు ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ ను పంచేలా కనిపిస్తున్నాయి.
By: M Prashanth | 13 July 2026 4:40 PM ISTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజు టీజర్ విడుదలైన తర్వాత సినిమాపై హైప్ మరింత పెరిగింది. దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఆ హారర్ కామెడీ మూవీలో ఎంటర్టైన్మెంట్, థ్రిల్, యాక్షన్ ను కొత్త తరహాలో చూపించే ప్రయత్నం చేసినట్లు టీజర్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా రాయలసీమ నుంచి కొరియా వరకు సాగే స్టోరీ లైన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
టీజర్ ప్రారంభం నుంచే కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం కనిపిస్తుంది. ఒకవైపు సాధారణ రాయలసీమ యువకుడిలా కనిపించే కనకరాజు.. మరోవైపు స్టైలిష్ కొరియన్ మాఫియా బాస్ గా వరుణ్ తేజ్ కనిపించడం కథపై క్యూరియాసిటీని పెంచుతోంది. ఆ రెండు భిన్నమైన షేడ్స్ ను ఎలా కలిపారన్న అంశాన్ని మాత్రం మేకర్స్ పూర్తిగా బయటపెట్టకుండా సస్పెన్స్ కంటిన్యూ చేశారు.
వరుణ్ తేజ్ లుక్ టీజర్ లో మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది. రాయలసీమ యువకుడి పాత్రలో చాలా న్యాచురల్ గా కనిపించడంతో పాటు, కొరియన్ అవతార్ లో స్టైలిష్ గా, ఇంటెన్స్ గా కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. రెండు విభిన్న పాత్రల్లో కూడా ఆయన చూపించిన బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉన్నాయి.
టీజర్ లో మరో స్పెషాలిటీ కామెడీ. ముఖ్యంగా వరుణ్ తేజ్, సత్య మధ్య వచ్చే సన్నివేశాలు ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ ను పంచేలా కనిపిస్తున్నాయి. హారర్ కామెడీకి అవసరమైన ఫన్నీ ఎలిమెంట్స్ ను దర్శకుడు ఈక్వల్ గా మిక్స్ చేసినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. భయం, నవ్వు రెండింటినీ ఒకేసారి అందించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. టెక్నికల్ గా కూడా టీజర్ మంచి రెస్పాన్స్ సంపాదిస్తోంది. కొరియా లొకేషన్లను చూపించిన తీరు, ప్రతి ఫ్రేమ్ ను గ్రాండ్ గా చూపించిన సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విజువల్స్ కు తగ్గట్టుగా సంగీత దర్శకుడు ఎస్. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కు మరింత బలం చేకూర్చింది. కొన్ని సన్నివేశాల్లో బీజీఎం థ్రిల్ ను పెంచగా, మరికొన్ని చోట్ల ఎంటర్టైన్మెంట్ కు తగ్గట్టుగా సాగింది. హీరోయిన్ గా రితికా నాయక్ నటిస్తున్న ఆ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ సౌత్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ టీజర్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. విజువల్ క్వాలిటీ, మేకింగ్ స్టాండర్డ్ సినిమాపై మరింత నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.
ఇప్పుడు కొరియన్ కనకరాజు మూవీ టీజర్ కేవలం కథను పరిచయం చేయడానికే పరిమితం కాకుండా, సినిమాలో ఉండబోయే ఎంటర్టైన్మెంట్ కు చిన్న ఉదాహరణగా చూపించినట్లు అనిపిస్తోంది. ఇండో- కొరియన్ బ్యాక్ డ్రాప్, వరుణ్ తేజ్ డ్యూయల్ షేడ్స్, హారర్ కామెడీ టచ్, స్టైలిష్ విజువల్స్ కలిసి ఆ చిత్రాన్ని ఆసక్తికరంగా మార్చాయి. టీజర్ కు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ తో ఆగస్టు 7న విడుదల కానున్న ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందన్న ఆసక్తి ఇప్పుడు సినీ ప్రియుల్లో నెలకొంది.
