Begin typing your search above and press return to search.

కనకరాజు జాతకం ముందే తేలిపోతుంది

సమ్మర్ సీజన్ స్లంప్ తర్వాత గత రెండు నెలల నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్‌లో మంచి ఊపు కనిపిస్తోంది. ‘పెద్ది’తో మొదలైన మంచి శకునం ఇంకా కొనసాగుతోంది.

By:  Garuda Media   |   5 Aug 2026 4:33 PM IST
కనకరాజు జాతకం ముందే తేలిపోతుంది
X

సమ్మర్ సీజన్ స్లంప్ తర్వాత గత రెండు నెలల నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్‌లో మంచి ఊపు కనిపిస్తోంది. ‘పెద్ది’తో మొదలైన మంచి శకునం ఇంకా కొనసాగుతోంది. అన్ని సినిమాలూ ఆడేస్తున్నాయని కాదు కానీ.. ప్రతి వీకెండ్లోనూ థియేటర్లు కళకళలాడుతున్నాయన్నది మాత్రం వాస్తవం. కొన్ని సినిమాలు రెండు మూడు వారాల పాటు బాగా ఆడి ఇండస్ట్రీలో ఒక పాజిటివ్ సైన్ తీసుకొచ్చాయి. రెండు వారాల ముందు వచ్చిన చెన్నై లవ్ స్టోరీ’ సెకండ్ వీకెండ్లో కూడా మంచి వసూళ్లు సాధించింది.

ఇప్పుడు టాలీవుడ్ ఫోకస్ మెగా కుర్రాడు వరుణ్ తేజ్ సినిమా ‘కొరియన్ కనకరాజు’ మీదికి మళ్లుతోంది. ఈ వారం కేజీక్యూ, డీసీ చిత్రాలు కూడా రిలీజవుతున్నప్పటికీ.. ప్రధానంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది వరుణ్ మూవీనే. ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాపై చాలా ధీమాగా ఉన్న టీం ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ కూడా ప్లాన్ చేసింది.

నిన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్లో స్వయంగా వరుణ్ తేజే ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రిమియర్స్ వేస్తున్న సంగతి ధృవీకరించాడు. ఐతే ఈ ప్రిమియర్స్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ‘చెన్నై లవ్ స్టోరీ’కి, అంతకుముందు రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’కి కూడా ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ వేశారు. కానీ ఆ షోల నుంచి పాజిటివ్ టాక్ రాలేదు. డివైడ్ టాక్‌ ఆయా చిత్ర బృందాలను, ఇండస్ట్రీని అయోమయానికి గురి చేసింది. కానీ ఆశ్చర్యకరంగా డివైడ్ టాక్‌ను తట్టుకుని ఆ సినిమాలు నిలబడ్డాయి.

దీంతో పెయిడ్ ప్రిమియర్స్ వేయడం ప్లస్సా, మైనస్సా అర్థం కాని పరిస్థితి తలెత్తింది. ఐతే పెయిడ్ ప్రిమియర్స్ వేస్తున్నారు అంటే సినిమా మీద టీం చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగి బుకింగ్స్, ఓపెనింగ్స్‌కు కలిసొస్తుందని మేకర్స్ భావిస్తున్నట్లున్నారు. మరి పెద్ది, చెన్నై లవ్ స్టోరీల్లా ‘కొరియన్ కనకరాజు’ డివైడ్ టాక్ తెచ్చుకుంటుందా.. పాజిటివ్ టాక్ సంపాదిస్తుందా.. టాక్ ఎలా ఉన్నా కూడా మంచి ఫలితాన్నందుకుంటుందా.. ఏం జరుగుతుందో చూడాాలి.