Begin typing your search above and press return to search.

వర్కింగ్ డేలోనూ కొరియన్ కనకరాజు జోరు.. టికెట్ బుకింగ్స్ తో ట్రెండింగ్!

వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా కొరియన్ కనకరాజు బాక్సాఫీస్ దగ్గర మంచి స్టెడీ రన్ కొనసాగిస్తోంది. ఈ నెల 7వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా వీకెండ్ లో సాలిడ్ వసూళ్లు రాబట్టింది.

By:  M Prashanth   |   10 Aug 2026 9:26 PM IST
వర్కింగ్ డేలోనూ కొరియన్ కనకరాజు జోరు.. టికెట్ బుకింగ్స్ తో ట్రెండింగ్!
X

వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా కొరియన్ కనకరాజు బాక్సాఫీస్ దగ్గర మంచి స్టెడీ రన్ కొనసాగిస్తోంది. ఈ నెల 7వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా వీకెండ్ లో సాలిడ్ వసూళ్లు రాబట్టింది. సాధారణంగా ఏ సినిమాకైనా అసలైన పరీక్ష సోమవారం నాడే ఎదురవుతుంది. వర్కింగ్ డే కావడంతో కలెక్షన్స్ డ్రాప్ అవ్వడం సహజం. కానీ ఈ సినిమా మాత్రం ఆ మండే టెస్ట్ ను చాలా ఈజీగా పాస్ అయినట్లు కనిపిస్తోంది.




తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల వరకు గ్రాస్ సాధించిన ఈ చిత్రం, డిస్ట్రిబ్యూటర్లను వేగంగా సేఫ్ జోన్ లోకి తీసుకొచ్చింది. హీరోయిన్ రితికా నాయక్ లక్కీ ఛార్మ్ సెంటిమెంట్ కూడా ఈ సినిమాకు బాగా వర్కౌట్ అయింది. వీకెండ్ ముగిసిన తర్వాత కూడా ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సినిమా లాంగ్ రన్ కి రెడీ అయినట్లు అర్థమవుతోంది.

ప్రస్తుతం బుక్ మై షో యాప్ లో కొరియన్ కనకరాజు ట్రెండింగ్ లో ఉండటం విశేషం. సోమవారం ఉదయం నుంచే టికెట్ బుకింగ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. కేవలం గడిచిన ఒక్క గంటలోనే 2.24K కి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి చూస్తే వర్కింగ్ డేస్ లో కూడా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.

టికెట్ సేల్స్ మాత్రమే కాకుండా, ఈ సినిమాకు ఆడియన్స్ ఇస్తున్న రేటింగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. బుక్ మై షోలో దాదాపు 19.7K పైగా ఓట్లతో 9.1 రేటింగ్ సొంతం చేసుకుంది. సాధారణ ప్రేక్షకుల నుంచి ఈ స్థాయిలో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం అనేది సినిమా మౌత్ టాక్ కు బాగా ప్లస్ అవుతోంది. కంటెంట్ జనాలకు కనెక్ట్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ నంబర్స్ ప్రూవ్ చేస్తున్నాయి. రాయలసీమ కుర్రాడి బ్యాక్ డ్రాప్ కు ఒక వింతైన ఆత్మ కాన్సెప్ట్ ను జోడించి తీసిన ఈ హారర్ కామెడీ స్టోరీ ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇస్తోంది.

2 గంటల 45 నిమిషాల రన్ టైమ్ ఉన్నప్పటికీ, ఎంటర్టైన్మెంట్ డోస్ కరెక్ట్ గా సెట్ అవ్వడంతో ఆడియన్స్ ఎంగేజ్ అవుతున్నారు. ముఖ్యంగా కామెడీ, హారర్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్ అవ్వడం వల్లే వర్కింగ్ డేస్ లో కూడా స్టెడీగా బుకింగ్స్ జరుగుతున్నాయి. చాలా రోజుల తరువాత వరుణ్ తేజ్ ఖాతాలో బాక్సాఫీస్ దగ్గర ఒక కమర్షియల్ సక్సెస్ పడింది. స్టార్టింగ్ డేస్ లో వచ్చిన బజ్ ను సోమవారం కూడా కంటిన్యూ చేయడంతో ట్రేడ్ వర్గాలు పాజిటివ్ గా ఉన్నాయి. ఇదే జోరు వారం మొత్తం కొనసాగితే, ఫస్ట్ వీక్ పూర్తయ్యే సరికి కొరియన్ కనకరాజు కలెక్షన్ల పరంగా మరిన్ని మంచి నంబర్స్ నమోదు చేసే అవకాశం ఉంది.