Begin typing your search above and press return to search.

'కొరియన్ కనకరాజు' సాంగ్ ప్రోమో.. ఆ పదం క్రేజీగా ఉందే!

ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఆ మూవీ నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్‌ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది.

By:  M Prashanth   |   10 April 2026 1:13 PM IST
కొరియన్ కనకరాజు సాంగ్ ప్రోమో.. ఆ పదం క్రేజీగా ఉందే!
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విభిన్నమైన కథలతో ప్రత్యేక గుర్తింపు పొందిన వరుణ్ తేజ్, ఈసారి కూడా కొత్త కాన్సెప్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఆ సినిమా హారర్, కామెడీ అంశాలతో పాటు ఇండియన్- కొరియన్ కల్చర్ ఎలిమెంట్స్ తో రూపొందుతోంది.

ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఆ మూవీ నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్‌ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. కంసాహమ్ నీదా అనే ఆ పాట ప్రోమో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. కొరియన్ భాషలో ధన్యవాదాలు అనే అర్థం వచ్చే ఆ పదాన్ని తెలుగు పాటలో యూజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇదే ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రోమోలో వరుణ్ ఊర మాస్ లుక్‌ లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఆ పాటలో ఆయన స్టెప్పులు ఎనర్జీతో కనిపిస్తున్నాయి. అ లుక్ ఆయన గత సినిమాలతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పాలి. కొరియన్ కనకరాజు సినిమాలో వరుణ్ తేజ్ కొత్త మేకోవర్‌తో కనిపించనున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.

చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్‌ గా నటిస్తోంది. వారి జోడీ కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మేర్లపాక గాంధీ సినిమాల్లో కనిపించే కామెడీ, ఎమోషనల్ ఎలిమెంట్స్ కొరియన్ కనకరాజులో కూడా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌ లో టాప్ ఫామ్‌ లో ఉన్న సంగీత దర్శకుడు తమన్, కొరియన్ కనకరాజు ఫస్ట్ సింగిల్ కు మాస్ బీట్‌ తో కూడిన క్యాచీ ట్యూన్ అందించినట్లు ప్రోమో ద్వారా అర్థమవుతోంది.

ఆ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించడం మరో ప్రత్యేకత. తమన్ సంగీతం, సిద్ శ్రీరామ్ గాత్రం కలయికతో ఆ సాంగ్ మెప్పిస్తోంది. సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఆ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. ముఖ్యంగా టైటిల్ గ్లింప్స్ విడుదలైన తర్వాత సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.

ఇక కంసాహమ్ నీదా పూర్తి లిరికల్ సాంగ్‌ ను ఏప్రిల్ 11న సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ పాట విడుదలతో సినిమాకు మరింత హైప్ రావచ్చని వినికిడి. మొత్తంగా చూస్తే, వరుణ్ తేజ్ కెరీర్‌ లో మరో భిన్నమైన ప్రయత్నంగా కొరియన్ కనకరాజు మూవీ నిలవనున్నట్లు కనిపిస్తోంది. మరి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. అదే సమయంలో నిర్మాతలు త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించి ప్రమోషన్స్ స్పీడప్ చేయడానికి సిద్ధమవుతున్నారు.