Begin typing your search above and press return to search.

సెన్సార్ ఫినిష్.. 'కొరియన్ కనకరాజు' ఇన్‌సైడ్ టాక్ ఏంటంటే!

వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' సినిమా విడుదలకి టైమ్ చాలా తక్కువగా ఉంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడు పెంచారు.

By:  M Prashanth   |   4 Aug 2026 1:24 PM IST
సెన్సార్ ఫినిష్.. కొరియన్ కనకరాజు ఇన్‌సైడ్ టాక్ ఏంటంటే!
X

వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' సినిమా విడుదలకి టైమ్ చాలా తక్కువగా ఉంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడు పెంచారు. ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక రన్‌టైమ్‌ను 2 గంటల 36 నిమిషాలుగా లాక్ చేశారు. కాన్సెప్ట్ రీత్యా ఇది పర్ఫెక్ట్ నిడివి అని తెలుస్తోంది.

సెన్సార్ పూర్తయిన తర్వాత ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం సినిమాలోని కామెడీ సన్నివేశాలు చాలా బాగా వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వరుణ్ తేజ్, కమెడియన్ సత్య మధ్య వచ్చే కామెడీ సీన్లు హైలెట్ అని టాక్. వరుణ్ తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకుని నవ్వించే ప్రయత్నం చేయగా, సత్య తన మార్క్ టైమింగ్‌తో బాగా ప్లస్ అయ్యాడని సమాచారం.

దర్శకుడు మేర్లపాక గాంధీ తీసుకున్న కొరియన్ కల్చర్, లోకల్ అనంతపురం బ్యాక్‌డ్రాప్ మిక్సింగ్ పాయింట్ బాగా కుదిరినట్లు తెలుస్తోంది. హారర్ ఫాంటసీకి హ్యూమర్ తోడవ్వడంతో వచ్చే కన్ఫ్యూజన్ డ్రామాను స్క్రీన్‌ప్లేతో డీల్ చేశారని టాక్. రొటీన్ దెయ్యాల కథలా కాకుండా, కల్చరల్ డిఫరెన్సెస్ వల్ల వచ్చే సిట్యువేషనల్ ఫన్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించే అవకాశం ఉంది.

టెక్నికల్ సైడ్ చూసుకుంటే తమన్ అందించిన పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేసిందని చెబుతున్నారు. సీన్లలోని ఫన్‌తో పాటు హారర్ ఎలిమెంట్స్‌కు తగినట్లు ఆర్ఆర్‌ఆర్ అందించడంలో తమన్ తన మార్క్ చూపించారట. బడ్జెట్‌కు తగ్గట్లుగా నాణ్యమైన విజువల్స్ తెచ్చేలా మేకర్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా కుదిరాయని అంటున్నారు.

ఇక ప్రమోషనల్ వీడియోలతోనే క్యూరియాసిటీ పెంచిన 'కొరియన్ కనకరాజు', ఇప్పుడు సెన్సార్ టాక్‌తో మరిన్ని ఆశలు రేపుతోంది. భారీ అంచనాలతో కాకుండా ప్రాక్టికల్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఆడియన్స్‌కు ఈ సినిమా మంచి ఆప్షన్ అయ్యేలా ఉంది. మరి ఆగస్టు 7న థియేటర్లలో ఈ హారర్ కామెడీ ఏ రేంజ్ కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.