వరుణ్ భక్తి ఎంతలా ఉందంటే?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అంటే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన సినిమాలు, మెగా ఫ్యామిలీ, యాక్షన్ రోల్స్.
By: M Prashanth | 31 July 2026 7:24 PM ISTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అంటే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన సినిమాలు, మెగా ఫ్యామిలీ, యాక్షన్ రోల్స్. కానీ స్క్రీన్ వెనుక ఆయన జీవితంలో మరో యాంగిల్ ఉంది. అది ఆధ్యాత్మికత. ముఖ్యంగా హనుమంతుడిపై ఆయనకున్న భక్తి గురించి తాజాగా చేసిన కామెంట్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. "నా బ్యాగ్ లో ఎప్పుడూ హనుమాన్ చాలీసా బుక్ ఉంటుంది. వారానికి రెండు సార్లు తప్పకుండా చదువుతాను" అంటూ వరుణ్ వెల్లడించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వరుణ్ తేజ్ ప్రస్తుతం కొరియన్ కనకరాజు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా హనుమంతుడిపై తనకున్న భక్తి గురించి చెప్పిన విషయాలు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. "నేను వారానికి రెండు సార్లు హనుమాన్ చాలీసా చదువుతా. నా బ్యాగ్ లో ఎప్పుడూ హనుమాన్ చాలీసా బుక్ ఉంటుంది. కొన్నిసార్లు నేను మర్చిపోయినా, మా వైఫ్ గుర్తు చేస్తుంది. ఆమె ఎంతో భక్తితో పూజలు చేస్తుంది. హనుమంతుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తుంది" అని వరుణ్ తేజ్ తెలిపారు.
ఇప్పటి వరకు వరుణ్ తేజ్ ను ప్రేక్షకులు యాక్షన్ హీరోగా, విభిన్న కథలను ఎంచుకునే నటుడిగా చూశారు. కానీ ఆయనలోని డివోషనల్ యాంగిల్ గురించి పెద్దగా బయటకు రాలేదు. తాజాగా చేసిన కామెంట్స్ తో ఆయన పర్సనాలిటీలోని మరో యాంగిల్ అభిమానులకు తెలిసింది. సినీ ఇండస్ట్రీలో బిజీ షెడ్యూల్, షూటింగ్ లు, జర్నీల మధ్య కూడా ఆధ్యాత్మికతకు సమయం కేటాయించడం విశేషంగా మారింది.
అంతేకాదు, తన కొడుకు పేరుకు సంబంధించిన విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. "హనుమంతుడిపై మాకు ఉన్న భక్తి కారణంగానే మా కొడుక్కి వాయు అనే పేరు పెట్టాం" అని చెప్పారు. పురాణాల ప్రకారం వాయుదేవుడు హనుమంతుడి తండ్రి. అందుకే ఆ పేరును తమ కుటుంబానికి ప్రత్యేకంగా భావించామని ఆయన వివరించారు. ఇటీవల సినీ సెలబ్రిటీలు తమ వ్యక్తిగత విశ్వాసాలు, ఆధ్యాత్మిక అనుభవాల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు.
కొందరు ఆలయాలను సందర్శిస్తే, మరికొందరు తమకు ఇష్టమైన దేవతల గురించి చెబుతున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా చేరారు. ముఖ్యంగా హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా చదువుతానని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు కొరియన్ కనకరాజు సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ చెప్పిన ప్రతి విషయం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
అయితే సినిమాకు సంబంధించిన అంశాల కంటే ఆయన చెప్పిన ఆధ్యాత్మిక విషయాలే ప్రస్తుతం ఎక్కువగా చర్చకు దారి తీస్తున్నాయి. సెలబ్రిటీల లైఫ్స్ ఎంతో బిజీగా ఉంటాయి. అయినప్పటికీ తమ నమ్మకాలు, సంప్రదాయాలను కొనసాగించడం చాలామందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ ను కూడా అదే మెసేజ్ ఇస్తున్నాయి. కెరీర్ లో ఎంత ఎత్తుకు వెళ్లినా, మన విశ్వాసాలను మరిచిపోకూడదనే విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేసినట్టైంది.
