Begin typing your search above and press return to search.

నితిన్‌ నుంచి వరుణ్‌ వద్దకి.. ఆయ్‌ కన్ఫర్మ్‌!

చిన్న బడ్జెట్‌తో రూపొందిన 'ఆయ్‌' సినిమా కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

By:  Ramesh Palla   |   13 Oct 2026 1:02 PM IST
నితిన్‌ నుంచి వరుణ్‌ వద్దకి.. ఆయ్‌ కన్ఫర్మ్‌!
X

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో వస్తూనే ఉన్నాడు. ఈ ఏడాదిలో వరుణ్‌ తేజ్ నటించిన 'కొరియన్‌ కనకరాజు' సినిమా విడుదలైన విషయం తెల్సిందే. సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కింది. మెగా ఫ్యాన్స్‌తో పాటు, కొందరు తెలుగు ప్రేక్షకులను కొరియన్‌ దెయ్యం ఆకట్టుకుంది. కొరియా బ్యాక్‌డ్రాప్‌ కారణంగా పాజిటివ్ బజ్ క్రియేట్‌ కావడంతో పాటు, విడుదలకు ముందు భారీ అంచనాలు పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఎంటర్‌టైన్ చేసింది. కొరియన్ కనకరాజు సినిమా పూర్తి అయిన వెంటనే వరుణ్‌ తేజ్ 'బరి' సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. కానీ వరుణ్‌ కి గాయం అయిన కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది. ప్రస్తుతం వరుణ్‌ రికవరీ అవుతున్నాడని, అతి త్వరలోనే బరి షూటింగ్‌ పునః ప్రారంభం కావడం ఖాయంగా కనిపిస్తోంది. బరి తర్వాత వరుణ్‌ చేయబోతున్న సినిమా గురించి ఇప్పుడు చర్చ మొదలైంది.

ఆయ్‌ సినిమా దర్శకుడు అంజి...

బరి సినిమా షూటింగ్‌ ప్రారంభం అయితే కేవలం రెండు మూడు నెలల్లోనే పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక అప్పటి వరకు మరో సినిమాను కమిట్‌ కావాలనే ఉద్దేశంతో వరుణ్‌ తేజ్ కొత్త కథలు విన్నాడట. గాయం కారణంగా షూటింగ్‌లకు దూరంగా ఉన్న వరుణ్‌ తేజ్‌ పలు కథలు విన్నాడట. అందులో కొన్ని కథలను ఎంపిక చేయడం జరిగిందని తెలుస్తోంది. ముఖ్యంగా 'ఆయ్‌' సినిమాతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న అంజి చెప్పిన విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ కథ వరుణ్‌ తేజ్‌కి బాగా నచ్చిందట. అందుకే ఆ సినిమాను చేసేందుకు వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది. నిహారిక కొణిదెల ఆ సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. మీడియం రేంజ్ బడ్జెట్‌తో సింపుల్‌, అండ్‌ స్వీట్‌గా ఆయ్ తరహాలోనే మెగా హీరో వరుణ్‌ తేజ్‌ తో అంజి సినిమాను తీస్తాడనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

మెగా హీరో వరుణ్‌ తేజ్ కొత్త సినిమా...

చిన్న బడ్జెట్‌తో రూపొందిన 'ఆయ్‌' సినిమా కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. పెద్ద నిర్మాతల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అంజి తన తదుపరి సినిమాను చేసేందుకు ఆయ్ తరహాలోనే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ కథను ఎంపిక చేసుకోవడం జరిగింది. మొదట నితిన్‌ ను కలిసి అంజి కథను చెప్పడం, ఆయన నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడం జరిగిందట. గీతా ఆర్ట్స్ కి చెందిన వారు సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం కాదని, నితిన్‌ తో అంజి సినిమా పట్టాలెక్కడం లేదని ఇటీవల కన్ఫర్మ్‌ అయింది. అయితే నితిన్‌ కి చెప్పిన కథనే మెగా హీరో వరుణ్‌ తేజ్ వద్దకు అంజి తీసుకు వచ్చాడని, నితిన్‌కు నచ్చినట్లుగానే వరుణ్‌ తేజ్‌ కి సైతం కథ నచ్చడంతో ప్రాజెక్ట్‌ ముందుకు వెళ్తుందనే వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు క్లారిటీగా తెలిసే అవకాశం ఉంది.

నితిన్‌ కి చెప్పిన కథ వరుణ్‌ తేజ్ వద్దకు...

నితిన్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా అంజితో చేయాల్సిన విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ మూవీకి వెంటనే డేట్లు ఇచ్చే పరిస్థితి లేదని, అందుకే వరుణ్‌ తేజ్ వద్దకు స్క్రిప్ట్‌ వెళ్లిందని అంటున్నారు. వరుణ్‌ తేజ్‌ కచ్చితంగా ఈ సినిమాతో మెగా ఫ్యాన్స్‌ తో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు కేవలం చర్చల దశలోనే ఉన్నప్పటికీ ఆయ్‌ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా ఈ కాంబోకి మంచి క్రేజ్ క్రియేట్‌ అవుతోంది. వరుణ్‌ తేజ్‌ గతంలో చేసిన విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. కనుక వరుణ్‌ తేజ్‌, అంజి కాంబోలో రూపొందబోతున్న సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కంటెంట్‌ ఉన్న సినిమాలకు మంచి ఆధరణ లభిస్తున్న ఈ సమయంలో అంజి మంచి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ కథతో వస్తే తప్పకుండా మరోసారి తెలుగు ప్రేక్షకులు ఆయ్‌ అంటూ సినిమాను ఆధరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.