Begin typing your search above and press return to search.

వీడియో : యంగ్‌ హీరో ఓపికకి అభినందనలు..!

దాంతో ఆ కారులో ఉన్న వ్యక్తి వరుణ్‌ ధావన్‌ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్‌ పట్ల దురుగా ప్రవర్తించాడు.

By:  Ramesh Palla   |   30 Sept 2025 4:00 AM IST
వీడియో : యంగ్‌ హీరో ఓపికకి అభినందనలు..!
X

బాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ ప్రస్తుతం సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమా ప్రమోషన్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. దసరా కానుకగా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న సినిమాపై వరుణ్ ధావన్‌తో పాటు, హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ చాలా నమ్మకం పెట్టుకుని ఎదురు చూస్తోంది. ఆకట్టుకునే కథ, కథనంతో పాటు మంచి గ్లామర్‌ ఈ సినిమాలో ఉంటుంది అని స్వయంగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సినిమా గురించి ఇన్ని రోజులుగా వార్తల్లో నిలిచిన వరుణ్‌ ధావన్‌ ఒక్కసారిగా ఒక కారు డ్రైవర్‌ వ్యవహారం కారణంగా వార్తల్లో నిలిచాడు. కాస్త సీరియస్‌గానే సాగిన ఈ ఇష్యూలో వరుణ్ ధావన్‌ వ్యవహరించిన తీరును చాలా మంది ప్రశంసిస్తున్నాడు. తాను సెలబ్రిటీని అనే ధోరణితో కాకుండా సింపుల్‌గాఏ ఈ వ్యవహారంను ధావన్‌ తేల్చేశాడు.

వరుణ్‌ ధావన్‌పై ప్రశంసలు

వివరాల్లోకి వెళ్తే.. వరుణ్‌ ధావన్‌ ప్రయాణిస్తున్న కారు పొరపాటున మరో కారును చిన్నగా డాష్ ఇవ్వడం జరిగిందట. దాంతో ఆ కారులో ఉన్న వ్యక్తి వరుణ్‌ ధావన్‌ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్‌ పట్ల దురుగా ప్రవర్తించాడు. ఆ సమయంలో వరుణ్ ధావన్‌ ఉన్నప్పటికీ, పోలీసులు వెంటనే వచ్చినప్పటికీ ఆయన ఆగడం లేదు. పై పైకి వెళ్లడంతో వరుణ్ ధావన్‌ స్వయంగా అతడిని సముదాయించే ప్రయత్నం చేశాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ఘటన గురించి ఎవరికి వారు ఏదో రకంగా కథనాలు అల్లేస్తున్నారు. అయితే చాలా మంది మాత్రం ఈ మొత్తం వ్యవహారంలో వరుణ్ ధావన్‌ చాలా ఓపికతో వ్యవహరించడం వల్లే సులభంగా గొడవ సద్దుమణిగింది అంటున్నారు. వరుణ్ ధావన్‌ వెంట చాలా మంది నెటిజన్స్ నిలుస్తున్నారు. ఆయన తీరును ప్రశంసిస్తూ సోషల్‌ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్‌ చేస్తున్నారు.

సినిమా ప్రమోషన్స్‌తో బిజీ బిజీ

భాయ్ భలేగా ఈ వివాదాన్ని హ్యాండిల్‌ చేశాడు, నిజంగా హీరో అనిపించుకున్నాడు, గొడవను చిన్న విషయంగా తేల్చేసి అక్కడికి అక్కడే సర్దుమనిగేలా చేయడం ద్వారా వరుణ్ గొప్ప పని చేశాడు అంటూ ఈ వీడియోలను తెగ షేర్‌ చేస్తూ వరుణ్ ధావన్‌ అభిమానులతో పాటు సామాన్యులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ప్రస్తుతం ఈ విషయం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. వరుణ్‌ ధావన్‌ మాత్రం ఇప్పటి వరకు ఈ విషయం గురించి పెద్దగా స్పందించలేదు. సినిమా ప్రమోషన్స్‌ తో ఆయన బిజీ బిజీగా ఉన్నాడు. సినిమా ప్రమోషన్‌ కారణంగానే వరుణ్‌ ధావన్‌ చాలా సైలెంట్‌గా వ్యవహారంను కూల్‌ చేశాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ విషయంలో వరుణ్‌ ధావన్‌ తీరును చాలా మంది ప్రశంసిస్తూ ఉండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వరుణ్‌ ధావన్‌కి జోడీగా జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా

జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించిన సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమాలో వరుణ్ ధావన్‌ హీరోగా నటించాడు. ఇంకా ఈ సినిమాలో సన్యా మల్హోత్రా, రోహిత్‌ సరాఫ్ లు ముఖ్య పాత్రల్లో నటించారు. శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్‌ లో కరణ్ జోహార్‌ నిర్మించాడు. దాంతో యూత్‌ ఆడియన్స్‌కి మంచి కిక్ ఇచ్చే అవకాశం ఉందని చాలా మంది అంటున్నారు. ఈ మద్య కాలంంలో వచ్చిన న్యూ జెనరేషన్‌ లవ్‌ స్టోరీ సినిమాలకు హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే ఈ సినిమా కూడా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు. బ్రేకప్‌, ఆ తర్వాత ప్రేమ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా బక్సాఫీస్‌ వద్దకు అక్టోబర్‌ 2న రాబోతున్న విషయం తెల్సిందే. జాన్వీ కపూర్‌ ఈ సినిమాలోని ఒక పాటలో అందాల ఆరబోతతో హీట్‌ పెంచేసిన విషయం తెల్సిందే. ఆ పాట కోసం అయినా సినిమాకు వెళ్లాలని అనుకునే వారు చాలా మంది ఉన్నారు.