Begin typing your search above and press return to search.

ఆశ‌ల‌న్నీ ఆయ‌న‌పైనా వ‌మ్ము చేయడుగా!

ఆ సినిమాలు కూడా అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో ఈ త్ర‌యం చేతులు క‌లిపి `స‌న్నీ సంస్కారికీ తుల‌సీ కుమారి`తో చేతులు క‌లిపిన సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   2 Sept 2025 7:00 AM IST
ఆశ‌ల‌న్నీ ఆయ‌న‌పైనా వ‌మ్ము చేయడుగా!
X

వ‌రుణ్ ధావ‌న్ కి స‌రైన హిట్ ప‌డి రెండేళ్ల‌వుతుంది. ఇటీవ‌లే రిలీజ్ అయిన `బేబిజాన్` ప్లాప్ అయింది. `మూంజ్యా`, `స్త్రీ 2` లాంటి చిత్రాల్లో న‌టించినా? ఆ రెండింటిలోనూ గెస్ట్ అప్పిరియ‌న్స్ కే ప‌రిమిత మ‌య్యా డు. అటు జాన్వీ క‌పూర్ ప‌రిస్థితి బాలీవుడ్ లో స‌వ్యంగా లేదు. పేరుకే సినిమాలు త‌ప్ప అందులో విజ‌యా లెన్ని అంటే? చెప్ప‌లేని ప‌రిస్థితే. దీంతో జాన్వీకి ఇప్పుడు హిట్ కీల‌కంగా మారింది. మ‌రోవైపు డైరెక్ట‌ర్ శశాంక్ ఖైతాన్ కూడా హిట్ కొట్టి చాలా కాల‌మ‌వుతోంది. `గోవిందా నామ్ మేరా` త‌ర్వాత రైట‌ర్ గా పని చేసాడు త‌ప్ప డైరెక్ట‌ర్ గా సినిమాలు చేయ‌లేదు.

ఆ సినిమాలు కూడా అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో ఈ త్ర‌యం చేతులు క‌లిపి `స‌న్నీ సంస్కారికీ తుల‌సీ కుమారి`తో చేతులు క‌లిపిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో మంచి హైప్ క్రియేట్ అయింది. డైరెక్ట‌ర్ సంగ‌తి ప‌క్క‌న బెడితే వ‌రుణ్ ధావ‌న్-జాన్వీక‌పూర్ మాత్రం శ‌శాంక్ ఖైతాన్ పై చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. గ‌తంలో ఇద్ద‌రికీ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడీయ‌న‌. జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన `ధ‌డ‌క్` చిత్రాన్ని ఇత‌డే తెర‌కెక్కించాడు.

ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఇంత వ‌ర‌కూ జాన్వీ కెరీర్ మొత్తంలో చెప్పుకోద‌గ్గ హిట్ ఏదైనా ఉందా? అంటే అది `ధ‌డ‌క్` మాత్ర‌మే. అలాగే వ‌రుణ్ ధావ‌న్ న‌టించిన `హంప్టీ శర్మాకీ దుల్భానియా`, `బ‌ద్రీనాధ్ కీ దుల్హానియా `మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు సినిమాలు తెర కెక్కించి కూడా శశాంక్ ఖైతానే. ఆ న‌మ్మకంతోనే సిద్దార్ధ్ మ‌రోసారి అత‌డితో ముందుకెళ్తున్నాడు.

అటు జాన్వీ...ఇటు సిద్దార్ద్..మ‌రోవైపు శశాంక్ ముగ్గురు `స‌న్నీ సంస్కారీకి తుల‌సీ కుమారీ`పై చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. ముగ్గురు హిట్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాల‌ని ఎదురు చూస్తున్నారు. ప్ర‌చార చిత్రాల‌కు పాజి టివ్ టాక్ రావ‌డంతో హిట్ పై న‌మ్మ‌కం రెట్టింపు అయింది. అక్టోబ‌ర్ లో చిత్రాన్ని ప్రేక్షకుల మందుకు తీసుకు రావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు, వ‌రుణ్ ధావ‌న్, జాన్వీ క‌పూర్ లు వేర్వేరు ప్రాజెక్ట్ ల‌తోనూ బిజీగా ఉన్నారు.