Begin typing your search above and press return to search.

వరుణ్ ధావన్ కొంపముంచిన "పర్ఫెక్ట్".. సోషల్ మీడియాలో భారీ ట్రోల్స్!

అప్పుడప్పుడు సినీ సెలబ్రిటీలు పెట్టే పోస్ట్లు సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకతను కలిగిస్తున్నాయి అనడంలో సందేహం లేదు.

By:  Madhu Reddy   |   22 Sept 2025 12:27 PM IST
వరుణ్ ధావన్ కొంపముంచిన పర్ఫెక్ట్.. సోషల్ మీడియాలో భారీ ట్రోల్స్!
X

అప్పుడప్పుడు సినీ సెలబ్రిటీలు పెట్టే పోస్ట్లు సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకతను కలిగిస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే వరుణ్ ధావన్ పెట్టిన ఒక చిన్న కామెంట్ ఆయనపై పూర్తిస్థాయిలో నెగెటివిటీ పెరిగేలా చేస్తోంది. మరి అసలు విషయం ఏమిటో? వరుణ్ ధావన్ పెట్టిన ఆ కామెంట్ ఏంటి? ఆయనపై ఎందుకు నెగెటివిటీ పెరిగిపోయింది? అసలేం జరిగింది ?అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.


బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న వరుణ్ ధావన్ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా తన నటనతో హ్యాండ్సం లుక్కుతో అందరి హృదయాలను దోచుకుంటున్నారు. అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు సొంతం చేసుకున్న వరుణ్ ధావన్ ప్రస్తుతం జాన్వీ కపూర్ తో కలిసి 'సన్నీ సంస్కారీకి తులసి కుమారి' అనే సినిమాలో చేస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ తో పాటు సన్యా మల్హోత్రా , మనీష్ పాల్,రోహిత్ షరాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో వేగంగా పాల్గొంటున్న వరుణ్ ధావన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే తాజాగా ఆయన చేసిన ఒక కామెంట్ ఇప్పుడు హద్దులు చెరిపేసిందని.. ఇది సిగ్గుచేటు చర్యగా చాలామంది విమర్శిస్తున్నారు. విషయంలోకి వెళ్తే.. భారత సినిమాల్లోకి హాలీవుడ్ నటి సిడ్నీ స్వినీ అడుగుపెడుతున్నట్లు ప్రకటించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఆమె బోల్డ్ దుస్తులలో కనిపించింది. కొంతమంది దీనిపై ట్రోల్స్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అయితే ఇలాంటి పోస్టును లైక్ చేస్తూ "పర్ఫెక్ట్" అని వరుణ్ ధావన్ కామెంట్ చేయడం హాట్ టాపిక్ మారింది.

వాస్తవానికి వరుణ్ ధావన్ వివాహితుడు.. ఇటీవల తండ్రి కూడా అయ్యాడు. ఇలాంటి సమయంలో మహిళల పోస్టులపై ఇలాంటి కామెంట్లు పెట్టడం సమంజసంగా లేదు అంటూ పలువురు ట్రోలర్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ సిడ్నీ బోల్డ్ లుక్ ని చూసి ఆయన ఇలా పర్ఫెక్ట్ అని కామెంట్ పెట్టాడని.. ఒక వివాహేతుడు అయ్యి ఉండి.. సదరు మహిళ పట్ల ఎలా ఇలాంటి కామెంట్లు చేస్తారు అని ఆయనపై విమర్శలు గుప్పిస్తూ ఉండడం గమనార్హం.

అయితే ఇలాంటి సమయంలో కొంతమంది వరుణ్ ధావన్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు. భారతీయ సినిమాల్లోకి ప్రవేశించే హాలీవుడ్ ప్రముఖులకు ఇలాంటి కామెంట్లు ఉత్సాహాన్ని ఇస్తాయని.. అనవసరంగా ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఇందులోకి లాగుతున్నారు అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా వరుణ్ ధావన్ పెట్టిన ఒక కామెంట్ ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితం పై కూడా ప్రభావం చూపేలా కనిపిస్తోందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా తన సినిమా విడుదల సమయంలో ఇలాంటి విమర్శలు ఎదుర్కోవడం ఆయన కొంప ముంచేలా ఉందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.