వాణీ విశ్వనాథ్ కూతుర్ని చూశారా.. తెలుగులో యమ క్రేజ్ గురూ!
ఇదిలా ఉండగా ఇప్పుడు ఒక సీనియర్ హీరోయిన్ కూతురు మాత్రం తెలుగులో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది..తన అందాలతో ప్రేక్షకులను అలరిస్తోంది.
By: Madhu Reddy | 7 Sept 2025 6:00 PM ISTసినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన తర్వాత.. తమ తదనంతరం తమ వారసులకి కూడా ఇండస్ట్రీలో అదే హోదా కల్పించాలని సెలబ్రిటీలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. అందులో భాగంగానే వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. తమ బాధ్యతను నెరవేర్చుకుంటూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సక్సెస్ అందుకోవడం అనేది ఆ వారసులపైనే ఆధారపడి ఉంటుంది. నిజానికి వారసులకు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉపయోగపడినా నిలదొక్కుకోవడానికి మాత్రం సొంత ప్రతిభ, అదృష్టం కలిసి రావాలి. అప్పుడే తమకంటూ ఒక ఇమేజ్ లభిస్తుంది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు..అందులో కొంతమంది గ్లోబల్ స్టార్ గా మారితే.. మరికొంతమంది పత్తా లేకుండా పోయారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు ఒక సీనియర్ హీరోయిన్ కూతురు మాత్రం తెలుగులో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది..తన అందాలతో ప్రేక్షకులను అలరిస్తోంది కూడా ఆమె ఎవరో కాదు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ వాణి విశ్వనాథ్ కూతురు. ఒకప్పుడు వాణీ తెలుగు, మలయాళం చిత్రాలలో దాదాపు అందరి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. అలాంటి ఈమె ఇప్పుడు తన కూతుర్ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. వాణీ విశ్వనాథ్ కూతురు ఇప్పటికే మూడు తెలుగు సినిమాలలో నటించగా.. ఇప్పుడు మరో నాలుగో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆమె ఎవరో కాదు వర్షా విశ్వనాథ్. వాణి విశ్వనాథ్ చెల్లెలు ప్రియా విశ్వనాథ్ కుమార్తెనే ఈ ముద్దుగుమ్మ. 2022లో 'రెడ్డి గారి ఇంట్లో రౌడీయిజం' అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది వర్షా విశ్వనాథ్. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. మలయాళంలో కూడా ఒక సినిమా చేసింది కానీ అది కూడా ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు. ప్రస్తుతం 'మటన్ సూప్' అనే సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈమె అందం, అభినయానికి ఆడియన్స్ కాదు సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోతున్నారు.. ఫర్ఫెక్ట్ ఫిగర్ మెయింటైన్ చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది వర్షా విశ్వనాథ్.
వాణి విశ్వనాథ్ కెరియర్ విషయానికి వస్తే.. ఒకప్పుడు తన అందంతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ధర్మతేజ, సాహసమే నా ఊపిరి, మామ అల్లుడు, కొదమ సింహం, సర్పయాగం, పరిష్కారం, సామ్రాట్ అశోక, ఘరానా మొగుడు, గ్యాంగ్ మాస్టర్ వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. ఇక మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని రాజకీయాలలో సందడి చేసిన ఈమె.. ఒక ప్రముఖ పార్టీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలనుకుంది. కానీ తన ఆలోచనను విరమించుకుంది.ఇప్పుడు మళ్లీ సినిమాలలో బిజీ అవుతోంది ఈ ముద్దుగుమ్మ
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన జయ జానకి నాయక సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఈమె ఆ తర్వాత కూడా పలు చిత్రాలలో నటించింది.
