Begin typing your search above and press return to search.

లేడీ డైరెక్ట‌ర్ బూతు సినిమా తీసిందంటున్నారా?

రీసెంట్ గా ఈ సినిమా గురించి బ్యాడ్ గ‌ర్ల్ డైరెక్ట‌ర్ వ‌ర్షా భ‌ర‌త్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   22 Sept 2025 1:55 PM IST
లేడీ డైరెక్ట‌ర్ బూతు సినిమా తీసిందంటున్నారా?
X

ఒక్కొక్క‌రికి ఒక్కో అభిరుచి ఉంటుంది. ఒక‌రికి ఒక‌టి న‌చ్చితే ఇంకొక‌రికి మ‌రోటి న‌చ్చుతుంది. అన్నీ అంద‌రికీ న‌చ్చాల‌ని లేవు. ప్రాంతాల‌ను బ‌ట్టి కూడా ప్ర‌జ‌ల అభిరుచులు ఉంటుంటాయి. అందుకే కొన్ని సినిమాలు నార్త్ లో ఆడితే, మ‌రికొన్ని సినిమాల‌కు సౌత్ లో ఎక్కువ ఆద‌ర‌ణ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ స‌మ‌స్యే కోలీవుడ్ లో తెర‌కెక్కిన బ్యాడ్ గ‌ర్ల్ కు కూడా వ‌చ్చిందంటున్నారు ఆ చిత్ర డైరెక్ట‌ర్ వ‌ర్షా భ‌ర‌త్.

ఎన్నో వివాదాల‌ను ఎదుర్కొన్న బ్యాడ్ గ‌ర్ల్

వెట్రిమార‌న్ శిష్యురాలైన వ‌ర్షాభ‌ర‌త్ కోలీవుడ్ లో బ్యాడ్ గ‌ర్ల్ అనే సినిమా చేశారు. ఎన్నో విమ‌ర్శ‌లు, వివాదాలు, ఆరోప‌ణ‌లు, కోర్టు తీర్పుల త‌ర్వాత బ్యాడ్ గ‌ర్ల్ సెప్టెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రాగా, సెప్టెంబ‌ర్ 26న ఈ సినిమా బాలీవుడ్ లో రిలీజ్ కానుంది. రీసెంట్ గా ఈ సినిమా గురించి బ్యాడ్ గ‌ర్ల్ డైరెక్ట‌ర్ వ‌ర్షా భ‌ర‌త్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

బ్యాడ్ గ‌ర్ల్ మూవీ రిలీజ్ కు ముందే ర‌చ్చ గెలిచింద‌ని, కానీ ఇంట గెల‌వ‌లేకపోయింద‌ని ఆమె ఆవేద‌న వ్యక్తం చేశారు. తాను తీసిన సినిమాకు ఇంట‌ర్నేష‌న‌ల్ లెవెల్ లో మంచి గుర్తింపు ద‌క్కింద‌ని, కానీ ఇండియాలో మాత్రం టీజ‌ర్ చూసి తానో బూతు సినిమా తీసిన‌ట్టు చూశార‌ని వ‌ర్షా పేర్కొన్నారు. బ్యాడ్ గ‌ర్ల్ మూవీ చూసి అంద‌రూ త‌ప్పుగా అర్థం చేసుకున్నార‌ని ఆమె తెలిపారు.

రోట‌ర్‌డ్యామ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డు

ఈ సినిమాలో బ్రాహ్మ‌ణుల‌ను చెడుగా చూపిస్తున్నార‌ని డైరెక్ట‌ర్ మోహ‌న్.. చిత్ర నిర్మాత‌లైన అనురాగ్ క‌శ్య‌ప్, వెట్రిమార‌న్ పై ఆరోప‌ణ‌లు చేయ‌డంతో టీజ‌ర్ ను యూట్యూబ్ నుంచి కూడా తీసేయాల్సి వ‌చ్చింది. టీజ‌ర్ రిలీజ‌య్యాక ఈ సినిమాను రోట‌ర్‌డ్యామ్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో స్క్రీనింగ్ చేయ‌గా, అక్క‌డ మూవీకి మంచి ప్ర‌శంస‌ల‌తో పాటూ అవార్డు కూడా వ‌చ్చింద‌ని, కానీ ఇక్క‌డి వాళ్లు మాత్రం తాను బూతు సినిమా తీశాన‌ని నింద‌లు వేశార‌న్నారు వ‌ర్షా భ‌ర‌త్.

ఆడియ‌న్స్ ఆలోచ‌నా విధానం అప్పుడే అర్థ‌మైంది

కానీ త‌మిళంలో సినిమా రిలీజయ్యాక ఆడియ‌న్స్ నుంచి బావుంద‌ని మాట విన‌గానే మ‌న‌సు కుదుట‌ప‌డి, ధైర్య‌మొచ్చింద‌ని వ‌ర్షా భ‌ర‌త్ చెప్పారు. కొన్నాళ్ల త‌ర్వాత త‌న ఫ్యామిలీని తీసుకుని సినిమాకు వెళ్లాన‌ని, మూవీ చూశాక వాళ్లేమీ త‌న‌ను విమ‌ర్శించ‌లేద‌ని, వారు విమ‌ర్శించ‌న‌ప్పుడే సినిమా బావుంద‌ని త‌న‌కు అనిపించింద‌ని, ప్ర‌జ‌ల ఆలోచ‌నా విధానం కూడా ఆ టైమ్ లోనే త‌న‌కు అర్థ‌మైన‌ట్టు వ‌ర్షా చెప్పారు.