Begin typing your search above and press return to search.

వరిష్ స్టూడియోస్ నెం.1.. మన వ్యసనమే వాళ్ల వ్యాపారం

లేటెస్ట్ గా వరిష్ స్టూడియోస్ అనే కొత్త బ్యానర్ ఇండస్ట్రీలో తమ ఫస్ట్ స్టెప్ వేస్తోంది. ప్రముఖ పీఆర్వో ఏలూరు శ్రీను, నిర్మాత పవన్ తరిగోపుల కలిసి ఈ నిర్మాణ సంస్థను స్టార్ట్ చేశారు. వీళ్లు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 ప్రాజెక్ట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వదిలారు.

By:  M Prashanth   |   3 July 2026 8:01 PM IST
వరిష్ స్టూడియోస్ నెం.1.. మన వ్యసనమే వాళ్ల వ్యాపారం
X

టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొత్త ప్రొడక్షన్ హౌసెస్ ఎంట్రీ ఇస్తూనే ఉంటాయి. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంకరేజ్ చేయడానికి ఇలా కొత్త వాళ్లు రావడం ఇండస్ట్రీకి ఎప్పుడూ ప్లస్ అవుతుంది. లేటెస్ట్ గా వరిష్ స్టూడియోస్ అనే కొత్త బ్యానర్ ఇండస్ట్రీలో తమ ఫస్ట్ స్టెప్ వేస్తోంది. ప్రముఖ పీఆర్వో ఏలూరు శ్రీను, నిర్మాత పవన్ తరిగోపుల కలిసి ఈ నిర్మాణ సంస్థను స్టార్ట్ చేశారు. వీళ్లు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 ప్రాజెక్ట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వదిలారు.




కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేయగా అందులో అందులో "మన వ్యసనమే, వాళ్ల వ్యాపారం" అనే క్యాప్షన్ నెటిజన్లను ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ సింగిల్ లైన్ బట్టి చూస్తే కథలో ఒక స్ట్రాంగ్ సోషల్ పాయింట్ ఉండబోతుందని అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క ట్యాగ్‌లైన్ చూస్తుంటే సమాజానికి సంబంధించిన ఓ బలమైన అంశాన్ని కథలో టచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి డార్క్ పాయింట్స్ కరెక్ట్ గా తీస్తే జనాలకు చాలా ఈజీగా కనెక్ట్ అవుతాయి.

రిలీజ్ చేసిన పోస్టర్ డిజైన్ చూస్తే సినిమా థీమ్ ఏంటో క్లారిటీ వస్తోంది. కోర్టు హాల్, న్యాయ దేవత త్రాసు ఉండేలా మంచి స్కెచ్ ఆర్ట్ వదిలారు. లీగల్ ఎలిమెంట్స్ కథలో కీలకంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. సమాజంలో జరిగే ఒక పెద్ద మోసాన్ని లీగల్ గా ఎలా ఎదుర్కొన్నారు అనే యాంగిల్ లో స్క్రీన్ ప్లే ఉండొచ్చు. లాజిక్స్ తో నడిచే ఇలాంటి సబ్జెక్టులకు ఎప్పుడూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.

ఈ డిఫరెంట్ ప్రాజెక్ట్ కి ఆనంద్ కె దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నటులు సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. త్వరలోనే ప్రధాన తారాగణంతో పాటు ఇతర ముఖ్యమైన టెక్నీషియన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు రానున్నాయి. జూలై 8న ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో లాంచ్ కాబోతోంది. ఓపెనింగ్ రోజున సినిమాకి సంబంధించిన మరిన్ని ముఖ్యమైన డీటెయిల్స్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఈ లాంచింగ్ ఈవెంట్ పూర్తయిన వెంటనే ఏమాత్రం లేట్ చేయకుండా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి మేకర్స్ పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. లొకేషన్స్, ఆర్టిస్టుల డేట్స్ లాంటి షెడ్యూల్స్ అన్నీ మేకర్స్ ఇప్పటికే ముందుగానే సెట్ చేసుకున్నట్లు సమాచారం.

ఈరోజుల్లో స్టార్ కాస్ట్ తో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే థియేటర్లలో ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇలాంటి ట్రెండ్ నడుస్తున్న టైమ్ లో వరిష్ స్టూడియోస్ ఒక మంచి సబ్జెక్ట్ తో రావడం కచ్చితంగా మంచి అటెంప్ట్ అని చెప్పాలి. డైరెక్టర్ ఈ పాయింట్ ని స్క్రీన్ మీద ఎంత థ్రిల్లింగ్ గా చూపిస్తాడు అనేదే ఇప్పుడు అసలు మ్యాటర్. త్వరలో సెట్స్ పైకి వెళ్తున్న ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్ లో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ రాబడుతుందో చూడాలి.