గ్లోబల్ బాక్సాఫీస్ రేసు: రాజమౌళి వర్సెస్ నితీష్ తివారీ!
ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో ముద్రను వేయడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఎస్.ఎస్. రాజమౌళి రూపొందుతోన్న `వారణాసి` -నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `రామాయణం` చిత్రాలు చర్చనీయాంశంగా మారాయి.
By: Srikanth Kontham | 5 July 2026 1:04 PM ISTప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో ముద్రను వేయడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఎస్.ఎస్. రాజమౌళి రూపొందుతోన్న `వారణాసి` -నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `రామాయణం` చిత్రాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ రెండు భారీ బడ్జెట్ ప్రాజెక్టులు స్వదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను అలరించేందుకు సిద్దమవుతున్నాయి. ఇద్దరు దిగ్గజ దర్శకుల మధ్య వద్ద అదృశ్య యుద్ధం మొదలైంది. రాజమౌళి తనదైన విజువల్ గ్రాండ్యూర్ కథా కథనంతో ఇప్పటికే `బాహుబలి`, `ఆర్ఆర్ఆర్` వంటి చిత్రాలతో గ్లోబల్ స్థాయిలో రికార్డులను సృష్టించారు.
మహేష్ హీరోగా తెరకెక్కిస్తోన్న `వారణాసి` చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఐమాక్స్ ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్న సినిమా పురాతన విశ్వం - టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ కావడంతో ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అలాగే నితీష్ తివారీ `రామాయణం`తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయాలని చూస్తున్నారు. ఇప్పటికే `దంగల్` వంటి ప్రపంచస్థాయి హిట్‌తో 2000 కోట్ల మార్కును అందుకున్న ఏకైక దర్శకుడిగా చరిత్ర సృష్టించారు.
ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ వంటి భారీ తారాగణంతో `రామాయణం` పార్ట్-1 , పార్ట్-2 చిత్రాలు తన పాత రికార్డును తానే అధిగమించేలా ఉంటాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రెహమాన్- హన్స్ జిమ్మర్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇలా ఇద్దరు దర్శకుల మధ్య పోలికలు ఆసక్తికరంగా మారాయి. రాజమౌళి ఎమోషనల్ యాక్షన్ ప్యాక్డ్ కథలతో ప్రేక్షకులను కట్టిపడేస్తే.. నితీష్ తివారీ తనదైన సామాజిక , పురాణ గాథలను అత్యంత సహజంగా భారీ విజువల్స్‌తో తెరకెక్కించడంలో దిట్ట. బాక్సాఫీస్ వద్ద `దంగల్` సృష్టించిన గ్లోబల్ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేదు.
తాజాగా `రామాయణం` తివారీ తన రికార్డును తానే తిరగరాస్తాడని బాలీవుడ్ నమ్మకంగా ఉంది. అటు `వారణాసి`తో రాజమౌళి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తాడని టాలీవుడ్ ఎదురు చూస్తోంది. భారతీయ చిత్రాలు వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లను సునాయాసంగా దాటేస్తున్న కాలంలో ఈ రెండు చిత్రాల విడుదల గ్లోబల్ బాక్సా ఫీస్ సమీకరణాలను మార్చేయడం ఖాయం. ఒకరు యాక్షన్ అడ్వెంచర్ శైలిలో ప్రపంచాన్ని విస్మయానికి గురిచే స్తుంటే? మరొకరు పురాణ ఇతిహాసంతో ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
