ఆ ప్లాన్‌లో భాగంగానే జక్కన్న పీసీని దించాడా?
సూపర్ స్టార్ మహేష్ బాబుతో జక్కన్న తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `వారణాసి`. 15 ఏళ్ల క్రితం దుర్గా ఆర్ట్స్ అధినేత కె.ఎల్. నారాయణకు ఇచ్చిన మాటకు కట్టుబడి రాజమౌళి ఈ సినిమాని తెరపైకి తీసుకొస్తున్నారు.
By: Tupaki Entertainment Desk | 18 Nov 2025 12:44 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబుతో జక్కన్న తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `వారణాసి`. 15 ఏళ్ల క్రితం దుర్గా ఆర్ట్స్ అధినేత కె.ఎల్. నారాయణకు ఇచ్చిన మాటకు కట్టుబడి రాజమౌళి ఈ సినిమాని తెరపైకి తీసుకొస్తున్నారు. ఫాంటసీ అంశాలతో పాటు హిందూ సనాతన ధర్మం, కీలకమైన పురాణ ఇతిహాసం రామయణంలోని కీలక ఘట్టాన్నితీసుకుని దానికి ప్రపంచ వినాశకర అంశాన్ని జోడించి రాజమౌళి `వారణాసి`ని తెరకెక్కిస్తున్నారు.
రీసెంట్ రిలీజ్ చేసిన గ్లింప్స్ తో అందరికి క్లారిటీ ఇచ్చేశాడు జక్కన్న. `బాహుబలి` సిరీస్‌తో పాన్ ఇండియా సినిమాలకు తెరలేపి టాలీవుడ్‌ని పతాక స్థాయిలో నిలబెట్టిన రాజమౌళి వరల్డ్ వైడ్‌గా మాత్రం ఆశించిన స్థాయిలో అటెన్షన్‌ని మాత్రం గెయిన్ చేయలేకపోయాడు. చైనా దాకా వెళ్లినా హాలీవుడ్ దిగ్గజాల దృష్టిని మాత్రం ఆకర్షించలేకపోయాడు. ఆ ప్లాన్‌లో భాగంగానే ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల కలయికలో చేసిన భారీ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`తో అందరి దృష్టిని ఆకర్షించడంతో సఫలమయ్యాడు.
అదే ప్లాన్‌తో ఇండియన్ సినిమాకు అసాధ్యం అనుకున్న ఆస్కార్‌ని సైతం సుసాధ్యం చేసి అందరి చేత భళా అనిపించుకున్నాడు. అయితే వరల్డ్ సినిమా అందులోనూ హాలీవుడ్ మన సినిమా గురించి భారీ స్థాయిలో చర్చించుకునేంతగా జక్కన్న చేయలేకపోయాడు. అయితే `వారణాసి` ఆ లోటుని భర్తీ చేసి ఇండియన్ సినిమా గురించి హాలీవుడ్ లోనూ భారీ చర్చ జరిగేలా ప్లాన్ చేశాడు.
ఆ ప్లాన్‌లో భాగంగానే పీసీ..గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాని `వారణాసి` కోసం రంగంలోకి దించాడని అంతా చర్చించుకుంటున్నారు. ప్రియాంక చోప్రా బాలీవుడ్‌ని వదిలి హాలీవుడ్‌కు వెళ్లడం అక్కడ పాపులర్ స్టార్‌లతో కలిసి నటించడంతో తక్కువ టైమ్‌లోనే పాపులారిటీని సొంతం చేసుకుంది. `వారణాసి`కి గ్లోబల్ అటెన్షన్ క్రియేట్ కావాలంటే జక్కన్నకున్న ఒకే ఒక్క ఆప్షన్ పీసీ. అందుకే తనని హీరోయిన్‌గా ఎంచుకున్నాడని తెలుస్తోంది. ప్రియాంక కూడా ఈ తరహా ప్రాజెక్ట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోందట.
ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌లోకి పీసీ ఈజీగా వచ్చి చేరిందని ఇన్ సైడ్ టాక్. ఇదిలా ఉంటే తెలుగు ప్రాజెక్ట్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకున్న ప్రియాంక చోప్రాకు ఇన్నేళ్లకు `వారణాసి`తో అవకాశం దక్కడంతో ఈ ప్రాజెక్ట్ కోసం ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటూ కుస్తీ పడుతోంది. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పీసీ ఈ ఈవెంట్‌లో మాట్లాడటం కోసం తెలుగు ప్రాక్టీస్ చేసిందట.
`తగలబెట్టేద్దామా` అంటూ పీసీ క్యూట్‌గా మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పీసీ ఈవెంట్ కోసమే తెలుగు నేర్చుకుందా? లేక సినిమాతో తన వాయిస్‌ని తానే వినిపించాలని తెలుగు నేర్చుకుందా? అన్నది తెలియాలంటే `వారణాసి` రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. వరల్డ్ వైడ్‌గా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీని 2027 సమ్మర్‌లో భారీగా రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే.
