Begin typing your search above and press return to search.

ఆరు అంటే.. జక్కన్న ఎలా ఇరికిస్తారో..

రాజమౌళి సినిమాల్లో పాటల కోసం కథను ఆపేయడం చాలా అరుదు. ‘బాహుబలి’లో ధీవర హీరో ప్రయాణంలోనే వచ్చింది.

By:  M Prashanth   |   23 Aug 2026 9:36 AM IST
ఆరు అంటే.. జక్కన్న ఎలా ఇరికిస్తారో..
X

‘వారణాసి’ని రాజమౌళి భారీ అడ్వెంచర్‌గా తీసుకొస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రయాణించే కథగా ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ కూడా అదే ఫీల్ ఇచ్చింది. అలాంటి సినిమాలో ఏకంగా ఆరు పాటలు ఉంటాయని ఇటీవల కీరవాణి చెప్పడం మాత్రం కొత్త డౌట్ తెచ్చింది. ఇంత పెద్ద అడ్వెంచర్ మధ్య జక్కన్న ఆరు పాటలకు ఎక్కడ స్పేస్ ఇస్తాడన్నది చూడాలి.

ఇప్పటికే ‘గ్లోబ్‌ట్రాటర్’ పేరుతో ఒక ట్రాక్ వచ్చింది. అందులోని ‘సంచారి’ లైన్స్ బాగా పాపులర్ కావడంతో చాలామంది అదే పేరుతో పిలుస్తున్నారు. శృతి హాసన్, కాలభైరవ పాడిన ఈ పాటను సినిమా లాంచ్ టైంలోనే వదిలారు. అయితే కీరవాణి చెప్పిన ఆరు పాటల్లో దీన్ని కూడా కలిపారా, లేక ఇది కేవలం ప్రమోషనల్ ట్రాక్ మాత్రమేనా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

రాజమౌళి సినిమాల్లో పాటల కోసం కథను ఆపేయడం చాలా అరుదు. ‘బాహుబలి’లో ధీవర హీరో ప్రయాణంలోనే వచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’లో నాటు నాటు రామ్, భీమ్ మధ్య బాండింగ్‌కు ఉపయోగపడింది. కొమురం భీముడో అయితే ఒక పాట కంటే కథలో జరిగే పెద్ద సీన్‌లానే ఉంటుంది. ‘వారణాసి’లో కూడా అలాంటి ప్లానింగ్ ఉండొచ్చు.

పైగా ఇందులో అడ్వెంచర్‌తో పాటు మైథాలజీకి కూడా మంచి స్పేస్ ఉంది. దీంతో ఆరు పాటలన్నీ రెగ్యులర్ డ్యూయెట్లు అవుతాయని అనుకోవాల్సిన పని లేదు. హీరో ప్రయాణం, మాంటేజ్, ఎమోషనల్ ఎపిసోడ్, మైథాలజీ సీక్వెన్స్.. ఇలా కథలోనే ఒక్కో పాటను వాడే ఛాన్స్ ఉంది. కీరవాణి సెప్టెంబర్ నుంచి బీజీఎం పనులు మొదలుపెట్టి జనవరి వరకు పూర్తి చేయాలని చూస్తున్నట్లు కూడా చెప్పారు.

అంటే షూటింగ్ చివరి దశకు వస్తున్న కొద్దీ మ్యూజిక్ మీద కూడా పని స్పీడ్ పెరుగుతోంది. ఆరు పాటలు అనే నంబర్ చూస్తే మాత్రం ‘వారణాసి’లో మ్యూజిక్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ పని ఉన్నట్టే. ‘సంచారి’ తరహాలోనే మిగతా పాటలు కూడా కథలో భాగంగా వెళ్లిపోతే ఆరు అనే నంబర్ పెద్దగా అనిపించకపోవచ్చు. కానీ హాలీవుడ్ లెవెల్ అడ్వెంచర్ అంటూ తీసుకొస్తున్న సినిమాలో రెగ్యులర్ సాంగ్ బ్రేక్స్ వస్తే మాత్రం ఫ్లో ఎలా ఉంటుందన్న డౌట్ ఉంటుంది. జక్కన్న ఆ లెక్కను ఎలా సెట్ చేశాడో సినిమా చూశాకే తెలుస్తుంది.