Begin typing your search above and press return to search.

'వారణాసి'.. మార్కెట్ లెక్కలు ఆ లెవెల్లో ఉంటాయా?

ప్రపంచ సినీ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటే మరో అద్భుతం సిద్ధమవుతోంది. దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' చుట్టూ ఇప్పుడు అంచనాలు మామూలుగా లేవు.

By:  M Prashanth   |   30 Jan 2026 10:53 AM IST
వారణాసి.. మార్కెట్ లెక్కలు ఆ లెవెల్లో ఉంటాయా?
X

ప్రపంచ సినీ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటే మరో అద్భుతం సిద్ధమవుతోంది. దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' చుట్టూ ఇప్పుడు అంచనాలు మామూలుగా లేవు. సాదాసీదాగా కాకుండా గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ మూవీ గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ భారీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ దగ్గర సృష్టించబోయే విధ్వంసం మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతోందని సినీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది.

ఇండియన్ సినిమా హిస్టరీలోనే కనీవినీ ఎరుగని రీతిలో సుమారు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. కేవలం షూటింగ్ కోసమే కాకుండా టెక్నికల్ వాల్యూస్ విషయంలో కూడా హాలీవుడ్ ప్రమాణాలను జక్కన్న పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆఫ్రికాలోని కెన్యా వంటి దేశాల్లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

అయితే ఈ భారీ ఇన్వెస్ట్‌మెంట్ వెనుక మేకర్స్ చాలా పక్కా ప్లానింగ్‌తో ఉన్నట్లు అర్థమవుతోంది. అసలు పాయింట్ ఏంటంటే.. ఈ సినిమా రిలీజ్ డేట్ అడ్వాంటేజ్ బాక్సాఫీస్ లెక్కలను పూర్తిగా మార్చేలా కనిపిస్తోంది. 2027 ఏప్రిల్ 7న ఉగాది పండుగ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి. ఇదే గనుక నిజమైతే పండుగ సెలవులతో పాటు సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ ఈ సినిమాకు కలిసి రానుంది.

ఈ డేట్‌ను బేస్ చేసుకుని విశ్లేషకులు వేస్తున్న అంచనాలు చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర 'వారణాసి' ఊచకోత మామూలుగా ఉండదని స్పష్టమవుతోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. 'వారణాసి' సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు 350 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందట. ఇక లాంగ్ వీకెండ్ (5 రోజులు) పూర్తయ్యే సరికి ఈ వసూళ్లు ఏకంగా 1250 కోట్లకు పైగా దాటొచ్చని లెక్కలు వేస్తున్నారు.

అంటే సినిమా రిలీజ్ అయిన మొదటి ఐదు రోజుల్లోనే పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకురావడమే కాకుండా ప్రాఫిట్ జోన్‌లోకి వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో ఈ సినిమాకు ఉన్న డిమాండ్ చూస్తుంటే ఇది అసాధ్యమేమీ కాదని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహేష్ బాబు మునుపెన్నడూ చూడని ఐదు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించబోతుండటం, ప్రియాంక చోప్రా వంటి ఇంటర్నేషనల్ స్టార్స్ ఈ ప్రాజెక్ట్‌లో ఉండటం సినిమా మైలేజీని రెట్టింపు చేస్తున్నాయి.

ఆఫ్రికా అడవుల్లో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్ కావడంతో విజువల్స్ పరంగా జక్కన్న మరో బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ స్థాయి మ్యాజిక్ రిపీట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. గ్లోబల్ లెవల్ మార్కెటింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 3వేల కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని టాక్. మొత్తానికి రాజమౌళి మహేష్ బాబు సినిమా బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వస్తే గానీ ఈ కలెక్షన్ల వర్షం ఏ స్థాయిలో ఉండబోతుందో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.