Begin typing your search above and press return to search.

వారణాసి స్టోరీ లైన్ లీక్.. ఇదన్నమాట అసలు కథ!

'వారణాసి' అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా కథ ఏంటి? అసలు ఏ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోంది? అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది.

By:  M Prashanth   |   4 Feb 2026 10:56 AM IST
వారణాసి స్టోరీ లైన్ లీక్.. ఇదన్నమాట అసలు కథ!
X

'వారణాసి' అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా కథ ఏంటి? అసలు ఏ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోంది? అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఇక గ్లోబల్ లెవల్లో ప్రమోషన్స్ మొదలుపెట్టిన జక్కన్న టీమ్, ఇప్పటికే హాలీవుడ్ మీడియాతో రకరకాల ముచ్చట్లు పెడుతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్లాట్ కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సినిమా కథ గురించి బయటకు వచ్చిన లీక్స్ చూస్తుంటే రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదని అర్ధమవుతుంది. ఒక మైథాలజీ ప్లస్ సైన్స్ ఫిక్షన్ తో వస్తున్నట్లు ముందుగానే క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో మహేష్ బాబు 'రుద్ర' అనే శివ భక్తుడి పాత్రలో కనిపిస్తారని ఇదివరకే టీజర్ పోస్టర్స్ తో క్లారిటీ ఇచ్చారు. ఇక హాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. ఒక పురాతనమైన, అత్యంత శక్తివంతమైన వస్తువును వెతికి పట్టుకోవడమే రుద్ర మెయిన్ మిషన్ అని తెలుస్తోంది.

విశ్వానికి సంబంధించిన ఆ అతీంద్రియ శక్తి గల పురాతన వస్తువు కోసం టైమ్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ ప్రయాణంలో రుద్రకు ఒక మాస్టర్ మైండ్ ఎదురవుతాడు. ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూసే విలన్ కుంభా (పృథ్వీరాజ్ సుకుమారన్) వల్ల కథలో ఎలాంటి అలజడి మొదలైంది? రుద్ర తన మిషన్ ను ఎలా పూర్తి చేశాడు? అనేదే వారణాసి మెయిన్ ప్లాట్ అని తెలుస్తోంది. ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర గురించి వస్తున్న అప్‌డేట్స్ చూస్తుంటే, హీరో కి విలన్ కి మధ్య జరిగే ఈ మైండ్ గేమ్ హై ఓల్టేజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది.

జక్కన్న తన సినిమాల్లో ఎప్పుడూ ఒక పక్కా ఎమోషన్ ఉండేలా చూసుకుంటారు. ఇందులో కూడా శివ భక్తి, టైమ్ ట్రావెల్ ఎలిమెంట్స్ ను చాలా నేచురల్ గా బ్యాలెన్స్ చేస్తున్నారట. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, రుద్ర చేసే ఈ జర్నీలో వచ్చే మలుపులు ఆడియన్స్ కు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయం. మహేష్ బాబు మేకోవర్ కూడా ఈ ప్లాట్ కు తగ్గట్టే చాలా కొత్తగా ఉండబోతోందట.

రుద్రగా ఆయన చేసే ఈ అడ్వెంచర్ కోసం ఇప్పటికే హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లు పని చేస్తున్నారు. రాజమౌళి తన గత చిత్రాల కంటే వారణాసిలో విజువల్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటార్కిటికా నుండి వారణాసి వరకు సాగే ఈ కథలో ప్రతి ఫ్రేమ్ కూడా ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తుందని అర్ధమవుతుంది. వారణాసి ప్లాట్ లీక్ అవ్వడంతో ఫ్యాన్స్ లో జోష్ పెరిగింది. ఇండియన్ సినిమాలోనే ఇది ఒక బిగ్గెస్ట్ ఎక్స్‌పెరిమెంట్ కాబోతోంది. 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతున్న ఈ ఎపిక్ డ్రామా బాక్సాఫీస్ రికార్డులను ఎలా తిరగరాస్తుందో చూడాలి.