Begin typing your search above and press return to search.

650 కోట్లు కూడా తక్కువేనా.. రాజమౌళి రిజెక్ట్ చేశారా?

మేటర్ ఏమిటంటే, 'వారణాసి' సినిమాకు నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ. 650 కోట్లు ఆఫర్ చేసిందట.

By:  M Prashanth   |   1 Dec 2025 9:52 AM IST
650 కోట్లు కూడా తక్కువేనా.. రాజమౌళి రిజెక్ట్ చేశారా?
X

రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ అంటేనే అంచనాలు హై రేంజ్ లో ఉంటాయి. ఇంకా షూటింగ్ పూర్తి కాకముందే, టైటిల్ వారణాసి అంటూ అధికారిక ప్రకటన చేశాక ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనాలు చూస్తుంటే ట్రేడ్ వర్గాలకు కూడా చెమటలు పడుతున్నాయి. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటివరకు ఎవరూ ఊహించని ఫిగర్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అసలు ఆ నంబర్స్ నిజమేనా అని ఆశ్చర్యపోయేలా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

సాధారణంగా రికార్డులు బద్దలు కొట్టడం అంటే పాత రికార్డుకు, కొత్త దానికి మధ్య కొంచెం తేడా ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది వేరు. ఏకంగా డబుల్ మార్జిన్ తో సరికొత్త చరిత్ర లిఖించడానికి రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఒకటి ఈ సినిమా కోసం కళ్ళు చెదిరే ఆఫర్ తో ముందుకొచ్చింది. ఒక పెద్ద సినిమా బడ్జెట్ అంత మొత్తాన్ని కేవలం డిజిటల్ రైట్స్ కోసం ఇస్తామని చెప్పినా, నిర్మాతలు మాత్రం ఇంకా ఆలోచిస్తున్నారట.

మేటర్ ఏమిటంటే, 'వారణాసి' సినిమాకు నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ. 650 కోట్లు ఆఫర్ చేసిందట. అన్ని భాషల ఓటీటీ హక్కుల కోసం ఈ భారీ మొత్తాన్ని ఇవ్వడానికి సిద్ధపడింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇంత పెద్ద ఆఫర్ వచ్చినా సరే, చిత్ర బృందం మాత్రం సంతృప్తిగా లేదని, ఇంకా బెటర్ డీల్ కోసం చూస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ నంబర్ ఎంత పెద్దదో తెలియాలంటే గత రికార్డులను ఒకసారి చూడాలి. ఇప్పటివరకు టాప్ లో ఉన్న 'కల్కి 2898 AD' సినిమాకు రూ. 375 కోట్లు, 'కేజీఎఫ్ 2'కు రూ. 320 కోట్లు, 'ఆర్ఆర్ఆర్'కు రూ. 300 కోట్ల డీల్స్ జరిగాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాకు ఏకంగా 650 కోట్లు అంటే, దాదాపు పాత రికార్డులకు ఇది రెట్టింపు అన్నమాట. రాజమౌళి బ్రాండ్, మహేష్ స్టార్ డమ్, ప్రియాంక చోప్రా గ్లోబల్ అప్పీల్ కలిసి ఈ సినిమా రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్ళాయి.

650 కోట్లు ఇస్తామన్నా ఇంకాస్త వెయిట్ చేస్తున్నారంటే, మేకర్స్ కాన్ఫిడెన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమా అవుట్ పుట్, విజువల్స్ గ్లోబల్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తాయని వారు గట్టిగా నమ్ముతున్నారు. హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోని విధంగా సినిమాను రూపొందిస్తున్నారు కాబట్టి, బిజినెస్ కూడా అదే స్థాయిలో జరగాలని ఆశిస్తున్నారు. బహుశా రిలీజ్ దగ్గరపడే కొద్దీ ఈ నంబర్ ఇంకా పెరిగే ఛాన్స్ కూడా లేకపోలేదు.

ఈ వార్త నిజమైతే మాత్రం ఇండియన్ సినిమా మార్కెట్ స్థాయిని రాజమౌళి మరోసారి పెంచేసినట్లే. కేవలం ఓటీటీ నుంచే ఇంత మొత్తం వస్తే, ఇక థియేట్రికల్, శాటిలైట్, ఆడియో రైట్స్ కలుపుకుంటే ప్రీ రిలీజ్ బిజినెస్ ఊహకందని రేంజ్ కి దాటడం ఖాయం.