Begin typing your search above and press return to search.

వారణాసి విషయంలో రాజమౌళి ప్లాన్ ఇదేనా.. అసలు ఆట ఇప్పుడే మొదలు?

సినిమా అంటే కథ, కథనం, నటీనటులు, సాంకేతిక హంగులు.. ఇవన్నీ ఎంత ముఖ్యమో, ప్రేక్షకుల్లో ఆ సినిమాపై సరైన సమయంలో ఆసక్తిని పెంచడం కూడా అంతే కీలకం.

By:  Sravani Lakshmi Srungarapu   |   12 Sept 2026 11:53 AM IST
వారణాసి విషయంలో రాజమౌళి ప్లాన్ ఇదేనా.. అసలు ఆట ఇప్పుడే మొదలు?
X

సినిమా అంటే కథ, కథనం, నటీనటులు, సాంకేతిక హంగులు.. ఇవన్నీ ఎంత ముఖ్యమో, ప్రేక్షకుల్లో ఆ సినిమాపై సరైన సమయంలో ఆసక్తిని పెంచడం కూడా అంతే కీలకం. ముఖ్యంగా రాజమౌళి వంటి డైరెక్ట‌ర్ సినిమా విషయంలో సహజంగానే భారీ అంచనాలు ఏర్పడతాయి. అయినప్పటికీ వారణాసి మూవీ విషయంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను చాలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ద‌స‌రా నుంచి ప్రమోష‌న్స్ ను భారీ స్థాయిలో మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్న వార్తలతో.. అసలు ఈ సినిమా ప్రమోషనల్ గేమ్ ఎలా ఉండబోతుందనే డిస్క‌ష‌న్ ఇండ‌స్ట్రీలో మొదలైంది.

రాజమౌళి సినిమాకు స్పెష‌ల్ గా హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేద‌ని సాధార‌ణంగా అంద‌రూ అభిప్రాయ‌ప‌డుతుంటారు. ఆయన సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో భారీ డిస్క‌ష‌న్ మొదలవుతుంది. కానీ వారణాసి మూవీ స్థాయి, మహేష్ బాబు క్రేజ్, అంతర్జాతీయ స్థాయిలో సినిమాపై ఉన్న ఆసక్తి దృష్ట్యా.. ఈసారి కేవలం హైప్ సరిపోదని మేకర్స్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రేక్షకుల అంచనాలను ఒక్కసారిగా పెంచడం కంటే, వాటిని దశలవారీగా మరింత ఎత్తుకు తీసుకెళ్లేలా ప్రమోషనల్ ప్లాన్ రూపొందిస్తున్నారనే విశ్లేషణ వినిపిస్తోంది. అంటే ప్రతి అప్డేట్‌ను ఒక రెగ్యుల‌ర్ పోస్టర్ లేదా అనౌన్స్‌మెంట్‌లాగా కాకుండా.. ఒక ఈవెంట్‌గా మార్చే ప్రయత్నం చేయ‌బోతున్నార‌నిపిస్తోంది.

ఇదే సమయంలో సినిమాలోని పాత్రలపై కూడా ఆసక్తిని పెంచే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న కుంభ పాత్రపై ఇప్పటికే క్యూరియాసిటీ ఉంది. వార‌ణాసి కోసం పృథ్వీరాజ్ నాలుగు రోజులు మిన‌హా త‌న షూటింగ్ భాగాన్ని పూర్తి చేశార‌ని తెలుస్తోంది. రాజమౌళి సినిమాల్లో విల‌న్ క్యారెక్ట‌ర్ కేవలం హీరోను ఎదుర్కొనే వ్యక్తిగా కాకుండా.. కథను ముందుకు నడిపించే కీలక శక్తిగా కనిపించడం కొత్తేమీ కాదు. బాహుబలిలో భల్లాలదేవ, ఆర్ఆర్ఆర్ లో స్కాట్ వంటి పాత్రలు కథలో సంఘర్షణకు బలమైన పునాది వేశాయి. దీంతో వారణాసిలో కుంభ పాత్ర కూడా కేవలం విలన్ షేడ్‌కే పరిమితం కాకుండా కథలో కీలక మలుపులకు కారణమవుతుందా అనే ఆసక్తి నెలకొంది.

అందుకే వారణాసి మూవీకి సంబంధించిన అసలు పరీక్ష షూటింగ్ పూర్తవడంలో కంటే.. ఇకపై ప్రేక్షకుల అంచనాలను ఎలా నడిపిస్తారనే విషయంలోనే ఉందని చెప్పొచ్చు. ద‌స‌రా నుంచి మొదలయ్యే ప్రచారం నిజంగానే వరుస అప్డేట్లకు నాంది అయితే.. ఒక్కో రివీల్‌తో సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లే అవ‌కాశముంది. అప్పటివరకు వారణాసి పై ఉన్న అంచనాలు ఒక ఎత్తయితే.. ప్రమోషనల్ రేస్ మొదలైన తర్వాత ఏర్పడే అంచనాలు మరో ఎత్తుగా మారే అవకాశాలు లేకపోలేదు.