వారణాసి.. మరో లెవెల్లో రాజమౌళి న్యూ స్ట్రాటజీ!
ఈ స్పెషల్ ఈవెంట్స్ లో రాజమౌళి గతంలో డైరెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ చిత్రాలను అక్కడి ప్రేక్షకులకు చూపించనున్నారు.
By: M Prashanth | 26 Jun 2026 10:51 PM ISTమహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా 'వారణాసి' కోసం సినీ ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎలాంటి చిన్న అప్డేట్ బయటకు వచ్చినా అది ఇంటర్నెట్ లో క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇక మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఒక కొత్త ఇంటర్నేషనల్ స్ట్రాటజీని లైన్ లోకి తెచ్చారు.
ఇక రొటీన్ గా పోస్టర్స్ రిలీజ్ చేయడం కాకుండా, ఇంటర్నేషనల్ స్టైల్ లో మార్కెటింగ్ మొదలుపెట్టారు. ఓ స్పెషల్ పోస్టర్ కూడా వదిలారు. జూన్ 26 నుంచి జూలై 4 వరకు రాజమౌళి ఐకానిక్ సినిమాల స్పెషల్ స్క్రీనింగ్స్ ను యూరప్ లో ప్లాన్ చేశారు. ఫ్రాన్స్ తో పాటు స్విట్జర్లాండ్ లోని ప్యారిస్, లియోన్, న్యూచాటెల్ లాంటి ప్రముఖ నగరాల్లో ఈ స్క్రీనింగ్స్ జరగనున్నాయి. ఒకేసారి గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ రాజమౌళి ప్రపంచాన్ని ఫ్రాన్స్ కు తీసుకువస్తున్నాం అని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ స్పెషల్ ఈవెంట్స్ లో రాజమౌళి గతంలో డైరెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ చిత్రాలను అక్కడి ప్రేక్షకులకు చూపించనున్నారు. గ్లోబల్ హిట్ సాధించిన ఆర్ఆర్ఆర్, బాహుబలి 1, బాహుబలి 2 తో పాటు మర్యాద రామన్న, ఈగ సినిమాలను ఈ స్క్రీనింగ్ లిస్ట్ లో చేర్చారు. ఈ థియేట్రికల్ స్క్రీనింగ్స్ తో పాటు కొన్ని చోట్ల రాజమౌళితో మాస్టర్ క్లాస్ సెషన్స్, ప్రెస్ మీట్స్, అలాగే ఫ్యాన్స్ తో మీట్ అండ్ గ్రీట్ లాంటి ఇంటరాక్షన్స్ కూడా ప్లాన్ చేయడం విశేషం.
అయితే ఈ ఇంటర్నేషనల్ టూర్ లో లోకల్ ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేసే అసలైన హైలైట్ వేరే ఉంది. ఈ ఈవెంట్ లో జరిగే ప్రతి సినిమా స్క్రీనింగ్ దగ్గర మహేష్ బాబు 'వారణాసి' సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను ప్రదర్శించబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీనికి తోడు యానిమేటెడ్ ప్రాజెక్ట్ 'బాహుబలి: ద ఎటర్నల్ వార్' కు సంబంధించిన గ్లింప్స్ కూడా ఈ థియేటర్లలో ఎక్స్ క్లూజివ్ గా చూపించనున్నారు.
అతిగా హడావిడి చేయకుండా, పక్కా ప్లానింగ్ తో ఇంటర్నేషనల్ మార్కెట్ ను క్రియేట్ చేసుకోవడం రాజమౌళికి ఉన్న అలవాటు. ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ క్యాంపెయిన్ చేసిన అనుభవంతో, ఇప్పుడు వారణాసి కి ముందు నుంచే గ్లోబల్ ఆడియన్స్ ను సెట్ చేసే పనిలో ఆయన ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నేరుగా ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ స్క్రీన్స్ మీద గ్లింప్స్ పడనుండటంతో సినిమాపై జనాల్లో మరింత బజ్ క్రియేట్ అవుతోంది.
